ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. తీర ప్రాంతం నేపథ్యంలో జరిగే కథతో హై ఇంటెన్సిటీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్నది. ఈ సినిమాలో సముద్రం నేపథ్యంలో వచ్చే యాక్షన్ ఘట్టాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం వచ్చే వారం నుంచి సముద్రం బ్యాక్గ్రౌండ్లో వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్కు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
ఇందుకోసం పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఎపిసోడ్లో ఎన్టీఆర్, సైఫ్అలీఖాన్పై స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో రొమాంచితమైన పోరాట ఘట్టాలను తెరకెక్కించబోతున్నారు. ఈ సీక్వెన్స్ సినిమాకు హైలైట్గా నిలుస్తుందని చెబుతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదలకానుంది.