Cinema Theatres | థియేటర్లకు మళ్లీ కళ.. టాకీస్‌లో సినిమా చూడటానికి ఇష్టపడుతున్న యువత
కొవిడ్ వల్ల కుదేలైన ఎన్నోరంగాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. కొవిడ్ కాకలో ఉండగానే సినీరంగాన్ని ఓటీటీ తీసిన దెబ్బ అంతా ఇంతా కాదు. పులి మీద పుట్రలా కరోనా కారణంగా థియేటర్లకు దూరమైన ప్రేక్షకులను ఓటీటీ ఇంటిపట్టునే ఉండేలా చేసింది.
Cinema Theaters | కొవిడ్ వల్ల కుదేలైన ఎన్నోరంగాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. కొవిడ్ కాకలో ఉండగానే సినీరంగాన్ని ఓటీటీ తీసిన దెబ్బ అంతా ఇంతా కాదు. పులి మీద పుట్రలా కరోనా కారణంగా థియేటర్లకు దూరమైన ప్రేక్షకులను ఓటీటీ ఇంటిపట్టునే ఉండేలా చేసింది. కొవిడ్ సమసిపోయినా ఓటీటీకి మరిగిన ప్రేక్షకులు థియేటర్లపై మోజు తగ్గించుకున్నారన్నది వాస్తవం.
అయితే, తాజా సర్వే సినీజనాలకు ఊరటనిస్తున్నది. యువ ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి మోజు చూపుతున్నారని ‘బుక్ మై షో’ నిర్వహించిన సర్వేలో తేటతెల్లమైంది. దాదాపు 650 నగరాల్లో దీనిని నిర్వహించగా జెనరేషన్ జెడ్‌లో 41 శాతం మంది, మిలీనియల్స్‌లో 59 శాతం మంది మంచి సినిమాను థియేటర్లో చూడటానికే ఆసక్తి కనబరిచారు. ఎంత ఓటీటీ వచ్చినా.. టాకీస్‌లో చూసినప్పుడు కలిగే అనుభూతి వేరని వాళ్లు చెప్పుకొచ్చారు.
అంతేకాదు, కాలక్షేపానికి ఎంచుకునే మార్గాల్లో సినిమాదే అగ్రతాంబూలమని అభిప్రాయపడ్డారు. సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపు 90 శాతం మంది థియేటర్లో సినిమా చూడటానికి ఇష్టం వ్యక్తం చేశారు. అంతేకాదు, ముందస్తుగా సినిమా ప్లాన్ చేసుకుంటున్న వాళ్ల శాతం 74గా నమోదైంది. భాషతో సంబంధం లేకుండా వీకెండ్ మంచి సినిమా చూస్తే చాలనుకుంటున్న వారి సంఖ్య 34 శాతంగా ఉంది. మొత్తంగా యంగ్తరంగ్ల సినిమా అభిమానం కారణంగా ఇండస్ట్రీకి గడ్డురోజులు తప్పాయని తెలుస్తున్నది. ఈ గజిబిజి జీవితంలో సినిమాను మించిన ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది చెప్పండి?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

