Nora Fatehi | ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈసారి ఫుట్‌బాల్ మహాసంగ్రామానికి యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తుండటంతో టోర్నీపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ప్రపంచకప్ ప్రారంభ వేడుకలు మూడు దేశాల్లో ఘనంగా నిర్వహించగా, కెనడాలో జరిగిన ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ స్టార్ డ్యాన్సర్, నటి నోరా ఫతేహి తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. కెనడాలో జరిగిన గ్రాండ్ ఓపెనింగ్ వేడుకలో నోరా ఫతేహి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆల్-రెడ్ కటౌట్ డిజైనర్ అవుట్‌ఫిట్‌లో స్టేజ్‌పైకి వచ్చిన ఆమె, తన గ్లామర్‌తో పాటు డ్యాన్స్ మూమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించింది. లూజ్ హెయిర్ స్టైల్, స్టైలిష్ లుక్‌తో కనిపించిన నోరా, అంతర్జాతీయ కళాకారులు వెజెడ్రీమ్, సంజయ్‌లతో కలిసి వేదికను పంచుకుంది.
ఫిఫా కోసం రూపొందించిన ప్రత్యేక ఫుట్‌బాల్ ఆంథెమ్‌ను ఆలపిస్తూ, వందలాది మంది బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్లతో కలిసి ఆమె చేసిన ప్రదర్శన స్టేడియాన్ని ఉర్రూతలూగించింది. ఆమె ఎనర్జీ, స్టేజ్ ప్రెజెన్స్, మాస్ డ్యాన్స్ మూవ్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ పెర్ఫార్మెన్స్కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈసారి ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలోనే అతిపెద్ద టోర్నీగా నిలుస్తోంది. తొలిసారిగా 48 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటుండటంతో నిర్వాహకులు మూడు ఆతిథ్య దేశాల్లో ప్రత్యేక ఓపెనింగ్ కార్యక్రమాలను నిర్వహించారు. అయితే మెక్సికో సిటీలో జరిగిన ప్రారంభ వేడుకల్లో అంతర్జాతీయ పాప్ స్టార్ షకీరా ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆమెతో పాటు బుర్నా బాయ్ కలిసి ఫిఫా అధికారిక గీతం డై డై ను తొలిసారి ప్రత్యక్షంగా ప్రదర్శించారు.
ఇక టోరంటోలో జరిగిన వేడుకల్లో నోరా ఫతేహి ప్రత్యేక ప్రదర్శనతో హైలైట్‌గా నిలిచింది. ఆమెతో పాటు అలెజాండ్రో ఫెర్నాండెజ్, బెలిండా, జె బాల్విన్ లాంటి స్టార్స్ అలరించారు వంటి ప్రముఖ కళాకారులు పాల్గొన్నారు. జూన్ 11న ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్ 2026 పోటీలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను అలరించనున్నాయి. ఫుట్‌బాల్ చరిత్రలోనే అతిపెద్ద టోర్నీగా నిలుస్తున్న ఈ మహోత్సవం జూలై 19న జరిగే గ్రాండ్ ఫైనల్‌తో ముగియనుంది. మ్యాచ్‌లతో పాటు ప్రారంభ వేడుకల్లో పాల్గొంటున్న ప్రపంచ ప్రఖ్యాత కళాకారుల ప్రదర్శనలు కూడా ఈ టోర్నీకి అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం నోరా ఫతేహి చేసిన హై-వోల్టేజ్ పెర్ఫార్మెన్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారి అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది.