సోమవారం వచ్చిందంటే బిగ్ బాస్ హౌజ్ నామినేషన్స్‌తో హోరెత్తిపోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో హౌజ్‌మేట్స్ ఒకవైపు నామినేషన్స్ నుండి తప్పించుకునేందుకు ఎత్తులు వేస్తూనే మరోవైపు వివిధ కారణాలతో తమకు నచ్చిన వారిని నామినేట్ చేస్తుంటారు. పదో వారం నామినేషన్ ప్రక్రియని కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడు బిగ్ బాస్.
ప్రస్తుతం హౌజ్‌కి కెప్టెన్‌గా ఉన్న అనీ మాస్టర్ని ఎవరైన నలుగురు కంటెస్టెంట్స్‌ని జైలులో కూడా పెట్టాలని ఆదేశించారు బిగ్ బాస్. దీంతో అనీ మాస్టర్.. మానస్, కాజల్, సన్నీ, షణ్ముఖ్‌లను నామినేట్ చేసి జైలులో పెట్టింది. అయితే వారికి నామినేషన్స్ తప్పించుకునే అవకాశం కూడా ఇచ్చాడు.
బజర్ మోగిన వెంటనే లివింగ్ రూమ్‌లో ఉన్న తాళాలను ఎవరైతే దక్కించుకుంటారో వాళ్లు.. తమకు ఇష్టమైన కంటెస్టెంట్‌ని జైలు నుంచి బయటకు తీసుకురావొచ్చని మిగిలిన ఇంటి సభ్యులకు సూచించాడు. అలా విడుదలైన సభ్యుడు హౌస్‌లో ఉన్న ఇద్దర్ని నామినేట్ చేయొచ్చని చెప్పారు. ఆ ఇద్దరు ఒకరు నామినేట్ అయ్యి జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సూచించారు.ఈ నామినేషన్ ప్రక్రియ కాన్సెప్ట్ విన్నాక ఎవరి ప్లాన్స్ వారు అమలు చేశారు. కాని సిరి మాత్రం తాను తవ్వుకున్న గోతిలో తానే పడింది.