ఆషాఢం తొందరపెట్టింది!

ఈ మధ్యే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది కన్నడ సోయగం ప్రణీత. చిరకాల మిత్రుడు నితిన్రాజుతో కలిసి ఏడడుగులు వేసింది.దక్షిణాదిలో పాపులర్ నాయికగా చెలామణీ అవుతున్న ఈ సొగసరి లాక్డౌన్ సమయంలో నిరాడంబరంగా పెళ్లి తంతును ముగించడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ విషయమై ప్రణీత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకకు ప్లాన్ చేశామని..అయితే జూలై నెలలో ఆషాఢమాసం వస్తుండటంతో లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ సింపుల్‌గా పెళ్లి చేసుకున్నామని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘కన్నడ, తెలుగు, హిందీ పరిశ్రమలో ఉన్న నా సన్నిహితులందరిని ఆహ్వానించి వైభవంగా వివాహాన్ని జరుపుకొందామని నిర్ణయించుకున్నాం. అయితే ఆషాఢమాసం సమీపిస్తుండటంతో పాటు ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో అనే అపనమ్మకంతో కొద్ది మంది సమక్షంలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అదీగాక కరోనా మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారిని చూసి హృదయం ద్రవించింది. సమాజం మొత్తం సంక్షోభంలో ఉన్నప్పుడు అనవసర విలాసాల జోలికి వెళ్లొద్దనే భావన కూడా సింపుల్‌గా పెళ్లి చేసుకోవడానికి కారణమైంది’ అని చెప్పింది ప్రణీత. ఈ వయ్యారి ప్రస్తుతం హిందీలో భుజ్, హంగామా-2 చిత్రాల్లో
నటిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

