No Time To Die: భారీ స్థాయిలో విడుదల కానున్న జేమ్స్ బాండ్ చిత్రం.. రిలీజ్ ఎప్పుడంటే..!

ప్రపంచ వ్యాప్తంగా జేమ్స్ బాండ్ చిత్రాలకు ఎంత ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం డేనియల్ క్రేగ్ బాండ్‌గా రూపొందుతున్న నో టైమ్ టూ డై చిత్రంపై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. థియేటర్లు తెరచుకున్నాకా విడుదలైన ‘షాంఘ్ ఛీ’, ‘ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్’ చిత్రాలకు మనదేశంలో మంచి ఆదరణ లభించడంతో ‘నో టైమ్ టు డై’ చిత్రాన్ని భారీస్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1700 థియేటర్స్‌లో చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్ చేస్తుండగా, అక్టోబరు 1 తర్వాత మహారాష్ట్రలో థియేటర్లు పూర్తిస్థాయిలో తెరచుకుంటే ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 30న చిత్రాన్ని 2డీ, త్రీడీ, 4డీలో విడుదల చేస్తున్నారు. తెలుగు,తమిళం,హిందీ,కన్నడ,ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
బాండ్ సిరీస్ నుంచి 24 చిత్రాలు వెండితెరపై సందడి చేయగా.. ఇప్పుడు 25వ చిత్రంగా ‘నో టైమ్ టు డై’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విలన్ సఫీన్‌గా రామి మాలెక్ ఇందులో నటిస్తున్నారు. కారీ జోజి దర్శకుడు. గతేడాది విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. అమెరికాలో అక్టోబరు 8న ‘నో టైమ్ టు డై’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ట్రైలర్ విడుదల కాగా, ఇందులోని యాక్షన్ సన్నివేశాలతో సాగిన ట్రైలర్ ఆకట్టుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- James Bond
- No Time To Die
RELATED ARTICLES
తాజా వార్తలు
చేవెళ్లలో ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసుల దాడి.. 25 మంది విద్యార్థులు అదుపులోకి!
Mrunal Thakur | చీరకట్టులోనూ మత్తెక్కించే అందాలు.. మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో అదుర్స్!
IND vs NZ | ఫిలిప్స్ విధ్వంసం.. భారత్‌కు 87 పరుగుల భారీ ఓటమి
Woman body in Pune flat | కుమార్తె లండన్‌లో చదువుతున్నదని భావించిన తల్లిదండ్రులు.. పూణే ఫ్లాట్‌లో ఆమె మృతదేహం
Pingili College Facultys | ఆలిండియా సివిల్ సర్వీసెస్ సాంస్కృతిక పోటీల్లో పింగిళి అధ్యాపకుల కళావైభవం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

