Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
Niti Taylor | సినీ పరిశ్రమలో గ్లామర్, పేరు ప్రఖ్యాతులు ఎంతగా కనిపిస్తాయో.. వాటి వెనుక కొందరు ఎదుర్కొనే చేదు అనుభవాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే నటీనటులకు అవకాశాల పేరుతో అనుచిత ప్రతిపాదనలు ఎదురవుతున్నాయనే ఆరోపణలు తరచూ తెరపైకి వస్తుంటాయి.
Niti Taylor | సినీ పరిశ్రమలో గ్లామర్, పేరు ప్రఖ్యాతులు ఎంతగా కనిపిస్తాయో.. వాటి వెనుక కొందరు ఎదుర్కొనే చేదు అనుభవాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే నటీనటులకు అవకాశాల పేరుతో అనుచిత ప్రతిపాదనలు ఎదురవుతున్నాయనే ఆరోపణలు తరచూ తెరపైకి వస్తుంటాయి. గతంలో ‘మీటూ’ ఉద్యమం ద్వారా పలువురు తమ అనుభవాలను వెల్లడించగా.. తాజాగా నటి నీతి టేలర్ తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఓ చేదు సంఘటనను గుర్తుచేసుకున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో రెండో సినిమా అవకాశం కోసం తనను ఓ దర్శకుడు అసభ్యకరమైన షరతు విధించాడని ఆమె వెల్లడించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.
టెలివిజన్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నీతి టేలర్.. దక్షిణాది చిత్రాల్లోనూ నటించారు. అయితే, సౌత్ ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె కీలక విషయాలు వెల్లడించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో తాను కేవలం రెండు సినిమాల్లో మాత్రమే భాగమయ్యానని ఆమె తెలిపింది. తన మొదటి సినిమా పూర్తయిన తర్వాత మరో ప్రాజెక్ట్ కోసం ఓ దర్శకుడు తనను సంప్రదించాడని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, రెండో సినిమాలో అవకాశం ఇవ్వాలంటే తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ ఆ దర్శకుడు అసభ్యకరమైన ప్రతిపాదన చేసినట్లు నీతి టేలర్ వెల్లడించారు. సినిమాల్లో అవకాశాలు కల్పించాల్సిన వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు ఎదురవడంతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఆమె చెప్పినట్లు కథనం పేర్కొంది. తన ప్రతిభ ఆధారంగా అవకాశాలు వస్తాయని ఆశించిన సమయంలో ఇలాంటి పరిస్థితి ఎదురవడం బాధ కలిగించిందని ఆమె వివరించింది.
ఇక ఆ సమయంలో తనకు ఎదురైన అనుభవం కారణంగా కొంతసేపు ఏం చేయాలో అర్థం కాలేదని నీతి టేలర్ చెప్పినట్లు సమాచారం. గతంలోనూ ఆ దర్శకుడి ప్రవర్తన గురించి కొన్ని విషయాలు గమనించినప్పటికీ, తన విషయంలోనూ ఇలాంటి ప్రతిపాదన చేస్తాడని ఊహించలేదని పేర్కొంది. అయితే, ఆ వ్యక్తితో వాదనకు దిగకుండా అతడి ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసినట్లు నీతి టేలర్ తెలిపింది. జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నానని ఆమె గుర్తుచేసుకుంది. ఆ సమయంలో తన తల్లి నుంచి లభించిన మద్దతు తనకు ఊరటనిచ్చిందని తెలుస్తోంది. సినిమాలపై ఆసక్తితో పరిశ్రమలోకి అడుగుపెట్టిన తనకు ఎదురైన ఈ సంఘటన తీవ్ర ప్రభావం చూపిందని నీతి టేలర్ చెప్పుకొచ్చింది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం కంటే టెలివిజన్ రంగంపైనే దృష్టి పెట్టాలని భావించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

