Bheemla nayak | పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్‌లో నిత్యా మీనన్ ఎలా ఉందో చూశారా!

Nithya menon look from Bheemla nayak | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయ్యప్పనుమ్ కోషియుమ్ మలయాళ సినిమాకు రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని ఈ షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అలాగే సినిమా నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ను ఇస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పవన్ కళ్యాణ్, రానా ఫస్ట్ లుక్ టీజర్లు సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాయి. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ అయితే యూట్యూబ్‌లో తెగ వైరల్ అవుతుంది. 12 మెట్ల కిన్నెరతో మొగులయ్య పాడిన ఈ పాట ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తుంది. ఇలా ఉంటే ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం.
Get ready for the other side of our #BheemlaNayak ♥️
— Sithara Entertainments (@SitharaEnts) October 5, 2021
The alluring 2nd Single ~ #AnthaIshtam… out on 15th Oct ✨
A @MusicThaman Musical!🎹@pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @ramjowrites @dop007 @NavinNooli @vamsi84 @adityamusic pic.twitter.com/MD0pQ2wyQQ
భీమ్లా నాయక్ సినిమా నుంచి మరో సాంగ్ విడుదల కాబోతుంది. అంతా ఇష్టం అనే పాటను అక్టోబర్ 15న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు సితార ఎంటర్టైన్మెంట్స్ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ఒక గుడిసె ముందు పవన్ కళ్యాణ్, నిత్యా మీనన్ కూర్చొని ఉన్న ఈ పోస్టర్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ భీమ్లా నాయక్ సినిమాను నిర్మిస్తున్నారు. సాగర్ కె చంద్ర ఈ సినిమాకు దర్శకుడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు.
ఈ సినిమాలో భీమ్లా నాయక్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. డేనియర్ శేఖర్ పాత్రలో రానా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్యగా నిత్యా మీనన్ నటిస్తోంది. రానా భార్యగా మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్‌ను ఎంపిక చేశారు. ఇటీవల ఈ విషయాన్ని స్వయంగా ఆమే ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Pawan kalyan | భీమ్లా నాయక్ ఆ బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా..?
Bheemla Nayak: రానా సరసన మలయాళీ ముద్దుగుమ్మ
Bheemla Nayak: భీమ్లా నాయక్ థియేటర్లోనా, ఓటీటీలోనా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Rana: రానా రేంజ్ పెరిగింది.. రెమ్యునరేషన్ అన్ని కోట్లా..!
pawan kalyan | పవన్ కళ్యాణ్ నిర్మాతలకు తిప్పలు మొదలయ్యాయా..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

