వకీల్ సాబ్ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ భీమ్లా నాయక్. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషీయమ్ అనే సినిమాకు తెలుగు రీమేక్‌గా వస్తోంది. సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్, రానాలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నాడు.
సినిమాకు సంబంధించిన పలు ప్రచార చిత్రాలు విడుదల కాగా, వీటికి సూపర్భ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రంలో పవన్ కల్యాణ్‌కు జోడీగా నిత్యమీనన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. రానాకు జోడీగా ఎవరు నటిస్తారు అనే దానిపై సస్పెన్స్ నెలకొని ఉండగా, దానికి క్లారిటీ ఇచ్చింది మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్.
భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఇందులో రానాకి జోడీగా నటిస్తున్నానని చెప్పింది సంయుక్త. భీమ్లా నాయక్‌లో పవన్ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. రానా డానియల్ శేఖర్‌గా అలరించనున్నాడు. జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.