Swayambhu | కార్తికేయ 2 సక్సెస్ తర్వాత సినిమాల విషయంలో స్పీడు పెంచాడు టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్దార్థ (Nikhil). ఈ టాలెంటెడ్ యాక్టర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల అప్డేట్స్ అందిస్తూ మూవీ లవర్స్ లో జోష్ నింపుతున్నాడు. ఇప్పటికే పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్పై (SPY) సినిమాలో నటిస్తున్న నిఖిల్ తాజాగా మరో సినిమా అప్డేట్ కూడా అందించాడు. నిఖిల్ నటిస్తోన్న మరో పాన్ ఇండియా సినిమా స్వయంభు (SWAYAMBHU). నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా నిఖిల్ 20గా వస్తున్న స్వయంభు ఫస్ట్ లుక్‌ను లాంఛ్ చేశారు మేకర్స్.
భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఆగస్టులో షూటింగ్ షురూ కానుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. నిఖిల్ యుద్ధ వీరుడిగా ఇదివరకెన్నడూ కనిపించని సర్ప్రైజింగ్ లుక్‌లో మెరువబోతున్నట్టు ఫస్ట్ లుక్ చెబుతోంది.
ఇదిలా ఉంటే స్పై మూవీతో పాపులర్ ఎడిటర్ గ్యారీ బీహెచ్ డైరెక్టర్‌గా డెబ్యూ ఇస్తున్నాడు. భారత దేశ నిగూఢ రహస్యమైన నేతాజీ మరణం మిస్టరీని ఛేదించే బాధ్యతను స్పై (నిఖిల్) కు అప్పగిస్తాడు. ఈ క్రమంలో సాగే యాక్షన్ సన్నివేశాలతో సినిమా ఉండబోతున్నట్టు టీజర్‌తో చెప్పేశాడు డైరెక్టర్. మరోవైపు ది ఇండియా హౌజ్ కూడా ప్రకటించేశాడు. దీంతోపాటు కార్తికేయ 3 కూడా లైన్లో ఉంది.
NIKHIL SIDDHARTHA’S NEW FILM ‘SWAYAMBHU’ WILL BE PAN-INDIA RELEASE… FIRST LOOK OUT NOW… On #NikhilSiddhartha’s birthday today, #TagoreMadhu – the presenter – unveils the #FirstLook of his new film #Swayambhu.
Directed by #BharatKrishnamachari… Music by #RaviBasrur… Produced… pic.twitter.com/fcriNU6nyV
— taran adarsh (@taran_adarsh) June 1, 2023
నిఖిల్ స్పై టీజర్..