Appudo Ippudo Eppudo | నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టీజర్ రిలీజ్
Appudo Ippudo Eppudo | టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న తాజా చిత్రం అప్పుడో ఇప్పుడో ఎప్పుడో (Appudo Ippudo Eppudo). ఈ సినిమాకు స్వామిరారా దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. ఛత్రపతి, డార్లింగ్ లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ టాప్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రోడక్షన్స్పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.
Appudo Ippudo Eppudo | టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న తాజా చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Appudo Ippudo Eppudo). ఈ సినిమాకు స్వామిరారా దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. ఛత్రపతి, డార్లింగ్ లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ టాప్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రోడక్షన్స్పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీని దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తాజాగా టీజర్‌ను విడుదల చేసింది.
టీజర్ చూస్తుంటే.. ఈ సినిమాలో నిఖిల్ రేసర్‌గా కనిపించబోతున్నాడు. హైదారాబాద్‌లోని ఒక బస్తిలో ఉండే నిఖిల్ లండన్ వెళ్లి ఒక తెల్ల పిల్లను ప్రేమలో పడేసి లైఫ్‌లో సెటిల్ అయిపోదాం అనుకుంటాడు. అయితే దీనికోసమే లండన్ వెళ్లిన నిఖిల్‌కు అక్కడ ఎదురైన సంఘటనలు ఏంటి అనేది ఈ మూవీ స్టోరీ అని తెలుస్తుంది. ఓ లవ్ స్టోరీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇక కన్నడ చిత్రం సప్త సాగరాలు దాటి సినిమాతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు దక్కించుకున్న రుక్మిణి వసంత్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

