ఎవరినైనా ద్వేషించడానికి కారణాలు అవసరమవుతాయి కానీ…ప్రేమించడానికి ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు నిఖిల్. ఆయన మాటల వెనకున్న భావమేమిటో తెలుసుకోవాలంటే ‘18’ పేజీస్’ చూడాల్సిందే అంటున్నారు పల్నాటి సూర్యప్రతాప్. ఆయన దర్శకత్వంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘18’ పేజీస్’. జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. గోపీసుందర్ స్వరపరచిన ఈ సినిమాలోని తొలి గీతానికి సంబంధించిన గ్లింప్స్‌ను గురువారం విడుదల చేశారు. ‘నాకు తెలియని ఒక అమ్మాయి ఎప్పుడూ ఒక విషయం చెబుతుండేది..ప్రేమించడానికి కారణం ఉండకూడదు. ఎందుకు ప్రేమించామా? అంటే ఆన్సర్ ఉండకూడదు’ అంటూ నిఖిల్ సంభాషణతో మొదలైన ఈ వీడియో గ్లింప్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఈ పాట పూర్తి వీడియోను త్వరలో విడుదల చేయబోతున్నారు. నవతరం ప్రేమకథా చిత్రమిదని, హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలతో సాగుతుందిన చిత్ర బృందం తెలిపింది.