మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక ఈ విషయాన్నైన ఓపెన్‌గా చేప్తేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరు కాగా, అందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సినిమాలు ఎందుకు చేయడం లేదనే ప్రశ్నకు నా భర్త చైతన్యకు తాను సినిమాల్లో నటించడం ఇష్టం లేదని, అందుకే సినిమాలు చేయడం మానేశానంది.హీరోయిన్లకు పెళ్లయినా కెరీర్ ఏం మారడం లేదని అందుకు సమంతను ఉదాహరణగా పేర్కొంది.
నటనలో నాకు చిరంజీవి స్పూర్తి అని చెప్పుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ వెబ్ సిరీస్ వంటి వాటిలో నటిస్తానని స్పష్టం చేసింది. అందుకు తన భర్త అనుమతి ఉందని తెలియజేసింది. బాగా మంచి పాత్ర వస్తే సినిమాల్లోను మా ఆయన్ని అడిగి చేస్తాను అని తెలిపింది ఈ కొణిదెల వారమ్మాయి. ఇక తన భర్త వరుణ్ తేజ్ చిన్నప్పటి క్లాస్ మేట్ అనే విషయం కూడా రివీల్ చేసింది.
ముద్దపప్పు ఆవకాయ్, నాన్నకూచీలతో పాటు యంగ్‌స్టర్స్‌తో కలిసి స్నేహంపై ఓ వెబ్‌సిరీస్ తీశానన్న నిహారిక ఇటీవలే ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం ప్రొడక్షనే కాకుండా యూట్యూబర్ నిఖిల్‌తో కలిసి ఓ సూపర్ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నానన్న ఆమె ఈ వెబ్ సిరీస్ విజయంపై చాలా నమ్మకంగా ఉంది.