బన్నీ సీటీమార్ ట్రై చేసిన సల్మాన్.. నెటిజన్స్ విమర్శలు

సాధారణంగా ఒక బ్లాక్ బస్టర్ పాటను ఒక భాష నుంచి మరో భాషలోకి తీసుకొని వెళ్లినప్పుడు.. అంచనాలతో పాటు పోలికలు కూడా చాలానే ఉంటాయి. అక్కడ ఎలా ఉంది.. ఇక్కడ ఎలా ఉంది అంటూ బేరీజు వేసుకుంటారు అభిమానులు. మా హీరో బాగా చేశాడు అంటే.. కాదు మా హీరో బాగా చేశాడు అంటూ లెక్కలు వేసుకుంటారు. ఇప్పుడు సీటీ మార్ సాంగ్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. అల్లు అర్జున్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన డీజే సినిమా కోసం దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన సీటీ మార్ పాట తెలుగులో నిజంగానే అందరితో సీటీ వేయించింది. అల్లు అర్జున్, పూజ హెగ్డే స్టెప్పులు ఈ పాటకు స్పెషల్ హైలెట్ గా నిలిచాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా అలాగే ఉంది. సింపుల్ స్టెప్స్ తో అల్లు అర్జున్ చితక్కొట్టాడు.
యూ ట్యూబ్ లో ఈ పాట సంచలనం సృష్టించింది. 207 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఇప్పుడు ఇదే పాట హిందీలో సల్మాన్ ఖాన్ రీమిక్స్ చేశాడు. ప్రభు దేవా దర్శకత్వం వహిస్తున్న రాధే సినిమా కోసం ఈ పాట వాడుకున్నారు. ఈ ఒక్క పాటకు అక్కడ కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. తాజాగా విడుదలైన ఈ సాంగ్ యూ ట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఒక్కరోజులోనే 22 మిలియన్ దక్కించుకుంది సీటీ మార్ పాట. మరీ ముఖ్యంగా సల్మాన్ ఖాన్ అభిమానులు ఆయన డాన్స్ చూసి ఫిదా అయిపోతున్నారు. దిశా పటాని కూడా అందాలతో పిచ్చెక్కించింది. ఇప్పటి వరకు వాళ్ళు ఆ పాట చూడలేదు కాబట్టి చాలా ఎగ్జైట్ అవుతున్నారు. దానికి తోడు సల్మాన్ భాయ్ కూడా తన మార్క్ డాన్స్ తో అలరించాడు.
కానీ సౌత్ ఆడియన్స్ ను మాత్రం ఈ పాట అస్సలు ఆకట్టుకోలేకపోయింది. మన దగ్గర అల్లు అర్జున్ డాన్స్ చూసిన కళ్ళతో కండల వీరుడి కదలికలు కంటికి ఇంపుగా కనిపించడం లేదు. మా బన్నీ ఎలా చేశాడు.. మీరు ఎలా చేస్తున్నారు భాయ్ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అల్లు అర్జున్ డాన్స్ ముందు సల్మాన్ ఖాన్ పూర్తిగా తేలిపోయాడు. నమ్మడానికి ఇది కష్టంగానే ఉంటుంది కానీ ఇదే నిజం. మన బన్నీ డాన్స్ చూసిన తర్వాత సల్మాన్ ఖాన్ సీటీ మార్ మనకు పెద్దగా నచ్చదు. ఇదే కండలవీరుడు గతంలో కిక్ సినిమా కోసం రింగ రింగా పాట రీమిక్స్ చేశాడు. అప్పుడు ఆ పాట సూపర్ హిట్ అయ్యింది. డాన్సులు కూడా బాగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు సీటీమార్ విషయంలో మాత్రం లెక్కలు తప్పుతున్నాయి. మే 13లో ఈద్ సందర్భంగా థియేటర్స్ తో పాటు డిజిటల్ లో కూడా ఒకే రోజు విడుదల అవుతుంది రాధే.
ఇవి కూడా చదవండి..
కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత మృతి
భారత్కు మే 1న ‘స్పుత్నిక్-వీ’ మొదటి బ్యాచ్ : ఆర్డీఐఎఫ్
కాస్త తగ్గినయ్.. కొత్తగా 3.23లక్షల కరోనా కేసులు, 2,771 మరణాలు
ఎన్నికల విజయోత్సవ ర్యాలీలపై ఈసీ నిషేధం
పీపీఈ కిట్లో పెళ్లి.. వైరల్ వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

