Imtiaz Ali | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ లో ఒకరు ఇంతియాజ్ అలీ. ఈ స్టార్ సెలబ్రిటీ ఇండస్ట్రీలో సక్సెస్, కష్టం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఔట్ సైడర్స్ (బయటివాళ్లు)తో పోలిస్తే నెపో స్టార్లే (స్టార్ కిడ్స్) ఎక్కువగా కష్టపడతారన్నాడు ఇంతియాజ్ అలీ.
అలియా భట్, రణ్‌బీర్ కపూర్‌తోపాటు ఇండస్ట్రీలో ఇంకా చాలా మంది యాక్టర్లు అదనపు కష్టాలను ఎదుర్కొంటారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వారి (ఇంట్లో, బంధువులు) చుట్టూనే సక్సెస్‌కు ఉదాహరణలుంటాయి. నెపో స్టార్లు తమను తాము విజయవంతమైన వాళ్లమని చెప్పుకోవాలంలే వాళ్లు మొదట తమ సొంత తండ్రులు, మామయ్యలు, తల్లులతో పోటీ పడాల్సి ఉంటుంది. నాలాగా బయటి నుంచి వచ్చిన వాళ్లకు ఇది సులభంగా ఉంటుందని ఇంతియాజ్ అలీ చెప్పుకొచ్చాడు. ఇంతియాజ్ అలీ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట రౌండప్ చేస్తున్నాయి.
జబ్ వీ మెట్, లవ్ ఆజ్ కల్, కాక్టెయిల్తోపాటు ఇండస్ట్రీకి సూపర్ హిట్ సినిమాలను అందించిన ఇంతియాజ్ అలీ ప్రస్తుతం మై వాపస్ ఆవూంగా సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో వస్తోంది.
Nithya Raman: లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో దూసుకెళ్తున్న నిత్యా రామన్
Flight crash | ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై పేలిన విమానం.. ఇద్దరు పైలట్లు మృతి..!
Bansuwada | విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకే పంపాలి.. బడిబాటలో ఉపాధ్యాయులు