న్యూఢిల్లీ: బాలీవుడ్‌తోపాటు పలు ఇతర భాషల్లో నటనతో భారీగా అభిమానులను సంపాదించుకున్న నేహాదూపియా, అంగద్ బేడీ దంపతులకు మగబిడ్డ జన్మించాడు. ఈ విషయాన్ని అంగద్ బేడీ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా వెల్లడించాడు. దైవం మాకు మగబిడ్డను ప్రసాదించడం ద్వారా ఆశీర్వదించింది. ప్రస్తుతం నేహా, చిన్నోడు ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు. మా పాప మెహర్ చిన్నారి పోస్ట్‌ను తన తమ్ముడికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నది అని అంగద్ బేడీ ఇన్‌స్టా హ్యాండిల్లో రాశారు.
ఇన్‌స్టాలో తమకు బిడ్డ పుట్టిన సమాచారం ఇవ్వడంతోపాటు వాళ్లు మెటర్నిటీ ఫొటోషూట్ సందర్భంగా తీసుకున్న ఒక అందమైన పొటోను కూడా అంగద్ బేడీ షేర్ చేశాడు. గర్భం దాల్చడం మొదలు బిడ్డ పుట్టే వరకు జరిగిన ప్రయాణంలో అన్ని కష్టాలను ఎదుర్కొన్న నేహాకు అంగద్ కృతజ్ఞతలు తెలిపాడు. కాగా నేహా దూపియా, అంగద్ బేడీల దంపతులకు ఇప్పటికే మెహర్ అనే పాప ఉన్నది. 2018లో మెహర్ జన్మించింది. మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ జంటకు మగబిడ్డ పుట్టాడు.