లక్నో : బరేలి ఎయిర్‌పోర్ట్‌లో వీఐపీ లాంజ్‌లోకి తనకు ఎంట్రీ లభించలేదని బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా (Neena Gupta) వెల్లడించారు. ఎయిర్‌పోర్ట్‌లో తనకు రిజర్వ్డ్ లాంజ్ యాక్సెస్ నిరాకరించారని ఇన్‌స్టా పోస్ట్‌లో నటి తెలిపారు. వీఐపీ లాంజ్ వెలుపల నుంచి రికార్డు చేసిన వీడియోను నీనా గుప్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
బరేలి ఎయిర్‌పోర్ట్‌లోని రిజర్వ్డ్ లాంజ్‌కు వెళ్లగా తనను లోపలికి అనుమతించలేదని, వీఐపీలకు ఉద్దేశించిన ఈ లాంజ్‌లోకి తన ఎంట్రీని అధికారులు నిరాకరించారని చెబుతూ తానింకా వీఐపీ కాలేదని ఆమె చెప్పుకొచ్చారు. ఇక నీనా గుప్తా చివరిసారిగా మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వేతో పాటు విశాల్ భరద్వాజ్ వెబ్ సిరీస్ చార్లీ చోప్రా అండ్ ది మిస్టరీ ఆఫ్ సొలంగ్ వ్యాలీలో కనిపించారు.
టితో పాటు ఆర్ బాల్కి లస్ట్ స్టోరీస్ 2లోనూ నీనా గుప్తా సందడి చేశారు. అనురాగ్ బసు మెట్రో ఇన్ డైనో, రొమాంటిక్ కామెడీ పచత్తర్ కా చోరా, బా, ఇష్క్ ఈ నదాన్, జాకీ ష్రాఫ్‌తో కలిసి సబన్లో కనిపించనున్నారు.
Read More :
Bigg Boss 7 Telugu | బిగ్‌బాస్‌లో అబ్బాయిలు ఎలిమినేట్ అవ్వరా.. అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారా..?