టాలీవుడ్ హీరో బాలకృష్ణ (Nandamuri Balakrishna), స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) కాంబోలో వస్తున్న క్రేజీ ప్రాజెక్టు ఎన్బీకే 107 (Nbk 107). ఇప్పటికే విడుదలైన ఫస్ట్ హంట్ టీజర్.. గూస్ బంప్స్ తెప్పించే డైలాగ్స్ తో సాగుతూ బాలకృష్ణ అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందించే సినిమాగా ఉండబోతుందని చెప్పేసింది. ఈ చిత్రం కర్నూల్ లో షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. తాజాగా కొత్త అప్డేట్ బయటకు వచ్చింది.
ప్రస్తుతం కర్నూల్లోని కొండారెడ్డి బురుజు, మౌర్యహోటల్ సెంటర్ వద్ద వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. సినిమాకు హైలెట్‌గా నిలువబోయే ఈ షూట్ షెడ్యూల్లో కీలక నటీనటులు పాల్గొననున్నట్టు ఇన్ సైడ్ టాక్. కన్నడ యాక్టర్ ధునియా విజయ్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ కీ రోల్ చేస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. థమన్ మ్యూజిక్ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం విడుదల ఎప్పుడనేది త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. రాయలసీమ నేపథ్యంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా పవర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్‌గా రానున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.
Read Also :Aadi Sai Kumar | ట్విటర్‌లోకి స్వాగతం..యువ హీరో వీడియో ట్రెండింగ్
Read Also : Liger Nizam Rights | ట్రెండింగ్ టాపిక్‌గా లైగర్ నైజాం రైట్స్..ఇంతకీ ఎంతో తెలుసా..?
Read Also : Thank You | థ్యాంక్యూలో ప్రముఖ నటుడి సీన్లు డిలీట్..నిజమెంత..?