సీనియర్ నటుడు నాజర్ ప్రధాన పాత్రలో, అంజలి నాయికగా రూపొందుతున్న చిత్రం ‘ముసలోడికి దసరా పండుగ’.డి.మనోహర్ దర్శకుడు. రమణవాళ్లె నిర్మాత.
ఇటీవల ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నాజర్ విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న చిత్రం ఇది. నాజర్ పాత్ర వైవిధ్యంగా, ఎంటర్టైనింగ్గా వుంటుంది. ఈ చిత్రాన్ని దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గారికి అంకితం ఇస్తున్నాం’ అన్నారు.