Nayanthara | పట్టుచీరలో నయనతార.. కాళికాంబాల్ ఆలయంలో ప్రత్యేక పూజలు,మహిళలకు చీరలు, పండ్ల పంపిణీ!
Nayanthara | దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార మరోసారి తన సంప్రదాయబద్ధమైన లుక్తో అభిమానులను ఆకట్టుకున్నారు. సాధారణంగా సినిమాలు, షూటింగులు, ప్రమోషన్లతో బిజీగా ఉండే ఈ అందాల తార.. తాజాగా ఆలయ సందర్శనతో వార్తల్లో నిలిచారు.
Nayanthara | దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార మరోసారి తన సంప్రదాయబద్ధమైన లుక్తో అభిమానులను ఆకట్టుకున్నారు. సాధారణంగా సినిమాలు, షూటింగులు, ప్రమోషన్లతో బిజీగా ఉండే ఈ అందాల తార.. తాజాగా ఆలయ సందర్శనతో వార్తల్లో నిలిచారు. చెన్నైలోని ప్రసిద్ధ కాళికాంబాల్ ఆలయాన్ని సందర్శించిన నయనతార అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టుచీర, ముక్కుపుడక, పెద్ద జుంకాలు ధరించి అచ్చమైన సంప్రదాయ భారతీయ మహిళలా కనిపించారు. ప్రస్తుతం ఆమె ఆలయ సందర్శనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
చెన్నైలోని ప్యారీస్ ప్రాంతం, తంబుశెట్టి వీధిలో ఉన్న ప్రసిద్ధ కాళికాంబాల్ ఆలయానికి నయనతార మంగళవారం వెళ్లారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సమయంలో ఆమె ఎంతో ప్రశాంతంగా కనిపించారు. సినిమా కార్యక్రమాల్లో ఆధునిక దుస్తుల్లో కనిపించే నయనతార, ఆలయంలో మాత్రం పూర్తిగా సంప్రదాయ వస్త్రధారణలో దర్శనమివ్వడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆలయ సందర్శనతో పాటు నయనతార మరో మంచి పనితోనూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఆలయానికి వచ్చిన మహిళలకు చీరలు, జాకెట్లు, పండ్లు పంపిణీ చేశారు. భక్తితో పాటు సేవా భావాన్ని కూడా చాటుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కేవలం సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ మంచి మనసును చాటుకుంటున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, నయనతార ప్రస్తుతం తన తాజా చిత్రం ‘మూక్కుత్తి అమ్మన్ 2’ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భక్తిరస చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. తెలుగులో ఈ సినిమా ‘మహాశక్తి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్ 6న ఈ చిత్రం విడుదల కానుంది. గతంలో విడుదలైన ‘మూక్కుత్తి అమ్మన్’ సినిమాలో అమ్మవారి పాత్రలో నయనతార తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు సీక్వెల్లోనూ మరోసారి అదే తరహా పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై ఆమె అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు నయనతార కాళికాంబాల్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పశువుల సంత వేలం ఖరారు
Nayanthara | పట్టుచీరలో నయనతార.. కాళికాంబాల్ ఆలయంలో ప్రత్యేక పూజలు,మహిళలకు చీరలు, పండ్ల పంపిణీ!
Midday meal | నారాయణగిరి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన వంట వివాదం
హైదరాబాద్ పాతబస్తీలో కలకలం.. మదర్సాలో 11 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులు
Sircilla | రౌడీ, హిస్టరీ షీటర్లపై పోలీసుల నిఘా.. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

