Annapoorani Movie | ఏ దేవుడు మాంసం తినడం పాపం అని చెప్పలేదు.. ఆసక్తికరంగా నయనతార ‘అన్నపూరణి’ ట్రైలర్
Nayanthara | లేడి సూపర్ స్టార్ నయనతార జోరు మామూలుగా లేదు. ఇటివలే షారుక్ ఖాన్ ‘జవాన్’(Jawan)తో నేషనల్ వైడ్ బ్లాక్ బస్టర్‌ని అందుకుంది ఈ భామ. మరోవైపు కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో వస్తున్న తన డ్రీమ్ ప్రాజెక్ట్‌లో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ సూపర్ స్టార్ తాజాగా మరో కొత్త సినిమాతో వస్తుంది.
Nayanthara | లేడి సూపర్ స్టార్ నయనతార జోరు మామూలుగా లేదు. ఇటివలే షారుక్ ఖాన్ ‘జవాన్’(Jawan)తో నేషనల్ వైడ్ బ్లాక్ బస్టర్‌ని అందుకుంది ఈ భామ. మరోవైపు కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో వస్తున్న తన డ్రీమ్ ప్రాజెక్ట్‌లో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ సూపర్ స్టార్ తాజాగా మరో కొత్త సినిమాతో వస్తుంది. నీలేష్ కృష్ణ (Nilesh Krishna) అనే కొత్త దర్శకుడితో నయనతార చేస్తున్న కొత్త చిత్రం ‘అన్నపూరణి’ (Annapoorani). నయన్ కెరీర్లో 75వ సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని ఎస్. ఆర్.రవీంద్రన్ సమర్పణలో, నాస్ స్టూడియోస్ -ట్రైడెంట్ ఆర్ట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా డిసెంబర్ 01న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నయనతార ఒక ప్రొఫెషనల్ చెఫ్‌గా మారాలనుకుంటుంది. ఈ క్రమంలో తనకు ఎదురైనా సవాళ్లు ఎంటి.. కుటుంబం నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకుని దేశంలో బెస్ట్ చెఫ్ గా ఎలా ఎదిగింది అనేది ఈ సినిమా స్టోరీ అని అర్థమవుతుంది. ఇక ఏ దేవుడు కూడా మాంసం తినడం పాపం అని చెప్పలేదు అంటూ వచ్చే డైలాగ్ ట్రైలర్‌కే హైలెట్‌గా నిలిచింది.
ఇక మూవీలో జై, సత్యరాజ్, అచ్యుత్ కుమార్, కెఎస్ రవికుమార్, సురేష్ చక్రవర్తి సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | బుల్లెట్ ప్రూఫ్ కవచం వెనుక అమితాబ్ బచ్చన్.. అభిమానుల కోసం భద్రత నడుమే ప్రత్యేక దర్శనం!
Mamitha Baiju | మమితా బైజు అసలు పేరు నమితనా? బర్త్ సర్టిఫికెట్లో జరిగిన పొరపాటుతో పేరు ఎలా మారిందో తెలుసా?
Plane Crash | ట్రంప్ నివాసానికి సమీపంలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. తొమ్మిది మంది మృతి
Cyclone Murasu | తీవ్ర తుపానుగా బలపడిన ‘మురాసు’.. ఏపీ తీరానికి పొంచి ఉన్న పెను ముప్పు!
గ్లామర్ డోస్ పెంచేసిన హెబ్బా పటేల్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బోల్డ్ ఫొటోషూట్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

