Annapoorani | చిక్కుల్లో నయనతార ‘అన్నపూరణి’.. నెట్‌ఫ్లిక్స్ నుంచి అవుట్
Nayanthara | కోలీవుడ్ లేడి సూపర్ స్టార్ నయనతార తాజాగా నటించిన చిత్రం ‘అన్నపూరణి’ (Annapoorani). నయన్ కెరీర్లో 75వ సినిమాగా వచ్చిన ఈ చిత్రాన్ని నీలేష్ కృష్ణ (Nilesh Krishna) దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 01న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయినా.. ఓటీటీలో మాత్రం అభిమానులను ఆకట్టుకున్నది.
Nayanthara | కోలీవుడ్ లేడి సూపర్ స్టార్ నయనతార తాజాగా నటించిన చిత్రం ‘అన్నపూరణి’ (Annapoorani). నయన్ కెరీర్లో 75వ సినిమాగా వచ్చిన ఈ చిత్రాన్ని నీలేష్ కృష్ణ (Nilesh Krishna) దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 01న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయినా.. ఓటీటీలో మాత్రం అభిమానులను ఆకట్టుకున్నది. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్‌ను నిలిపివేస్తునట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
ఈ సినిమా రాముడిని కించపరిచేలా ఉందంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రాముడు కూడా మాంసం తిన్నాడని.. ఇది వాల్మీకి అయోధ్య కాండలో ఉంది అంటూ ఒక డైలాగ్ ఉంటుంది.
అయితే తాజాగా ఈ సినిమా చూసిన మహారాష్ట్రకు చెందిన శివసేన మాజీ నేత రమేశ్ సోలంకి మూవీలోని కొన్ని సీన్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘అన్నపూరణి’ సినిమాలో రాముడు కూడా మాంసం తిన్నాడు అనడం.. శ్రీరాముడిని కించపరిచేలా ఉందని.. అలాగే హీరో ముస్లిం అయ్యి ఉండడం, హీరోయిన్ బ్రాహ్మణ కుటుంబానికి చెంది ఉండడంతో లవ్ జీహాద్‌ను ప్రోత్సహించేలా ఉందని.. ఈ మూవీ నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని రమేశ్ సోలంకి ఫిర్యాదులో పేర్కొన్నాడు. అలాగే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్న నెట్ ఫ్లిక్స్‌పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ విషయంపై వివాదం ఎక్కువ అవ్వడంతో నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఈ సినిమా విషయంలో నయనతారపై కూడా కేసు నమోదు అయ్యింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

