ఆకట్టుకునే మర్డర్ మిస్టరీ
తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న కొత్త సినిమా ‘హత్య’. రితికా సింగ్, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్, లోటస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను హీరో నాని విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హీరోయిన్ రితికా సింగ్ మాట్లాడుతూ…‘చిన్నప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనే కల ఉండేది. కానీ బాక్సర్, హీరోయిన్ అయ్యాను. ఈ చిత్రంలో ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నటించడం సంతృప్తినిచ్చింది’ అని చెప్పింది. నిర్మాత జి. ధనుంజయన్ మాట్లాడుతూ…‘విజయ్ ఆంటోనీతో మేము ఐదు చిత్రాలు నిర్మిస్తున్నాము. ఈ కథ విన్నాక బాగా క్వాలిటీగా నిర్మించాలనే స్ఫూర్తి కలిగింది.
ఇది పూర్తిగా దర్శకుడి విజన్ అనుకోవచ్చు’ అని అన్నారు. దర్శకుడు బాలాజీ కుమార్ మాట్లాడుతూ…‘మర్డర్ మిస్టరీ నేపథ్య చిత్రమిది. లైలా అనే అమ్మాయి మర్డర్ నేపథ్యంతో సాగుతుంది. ఆ హత్య ఎవరు చేశారు? ఎలా చేశారు? అనే ప్రశ్నలు కథలో కీలకంగా ఉంటాయి’ అన్నారు. హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ..‘దర్శకుడు బాలాజీ కుమార్ ఆల్ రౌండర్ అని చెప్పాలి. లోటస్ పిక్చర్స్, ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థల్లో నటించడం సంతోషంగా ఉంది. వాళ్లతో మరిన్ని చిత్రాలు చేస్తాను. ఈ మర్డర్ మిస్టరీ మూవీ మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు బెల్లంకొండ సురేష్, జీవీజీ రాజు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

