సుదర్శన్, ‘రంగస్థలం’ మహేష్, అర్జున్తేజ్, డా॥ భద్రం, శేషాద్రి ముఖ్యపాత్రల్లో రూపొందనున్న చిత్రం ‘నటరత్నాలు’. గాదె నాగభూషణం దర్శకుడు. ఎన్.ఎస్.నాగేశ్వరరావు నిర్మాత. నిర్మాత మాట్లాడుతూ ‘అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కనున్న క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ ఇది.
పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నాగమధు.