రక్షిత్ అట్లూరి, అపర్ణ జనార్థన్, సంకీర్తన విపీన్ ప్రధానపాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘నరకాసుర’. సెబాస్టియన్ నోవా ఆకోస్టా జూనియర్ దర్శకుడు. అజ్జ శ్రీనివాస్ నిర్మాత. నవంబర్ 3న సినిమా విడుదల కానుంది.
మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ మాట్లాడుతూ “ పోస్టర్లో, టీజర్లో చూసింది కొంతే. ఇందులో ఆశ్చర్యపరిచే అంశాలు చాలా ఉంటాయి. ‘నరకాసుర’ అనగానే దీపావళి పండగ గర్తొస్తుంది. దీపావళికి వారం ముందు విడుదలవుతున్న మా సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నాం’ అని చెప్పారు. ఈచిత్రానికి కెమెరా: నాని చమిడిశెట్టి, సంగీతం: ఏఐఎస్ నాఫాల్ రాజా.