కేటీఆర్ సలహా నచ్చింది!
‘దర్శకుడిగా తొలి సినిమా అవకాశం రావడమే కష్టం అనుకుంటే.. షూటింగ్ టైమ్‌లో జరిగిన ప్రమాదంలో నా కుడి చేయిని కోల్పోయా. అయినా ఆత్మవిశ్వాసంతో సినిమా పూర్తిచేశా’ అన్నారు దర్శకుడు సెబాస్టియన్.
‘దర్శకుడిగా తొలి సినిమా అవకాశం రావడమే కష్టం అనుకుంటే.. షూటింగ్ టైమ్‌లో జరిగిన ప్రమాదంలో నా కుడి చేయిని కోల్పోయా. అయినా ఆత్మవిశ్వాసంతో సినిమా పూర్తిచేశా’ అన్నారు దర్శకుడు సెబాస్టియన్. ఆయన నిర్దేశకత్వంలో రక్షిత్ అట్లూరి, అపర్ణ జనార్ధన్, సంకీర్తన విపిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘నరకాసుర’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సెబాస్టియన్ మాట్లాడుతూ ‘ఈ సినిమా కథ రాసుకొని మరింతగా డెవలప్ చేసే టైమ్‌లో ‘భరత్ అనే నేను’ సినిమాకు సంబంధించి ఓ ఈవెంట్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌గారి వీడియో చూశాను. అందులో ఆయన ‘ట్రాన్స్‌జెండర్స్‌ను సినిమాల్లో కమర్షియల్‌గా చూపిస్తున్నారు అలా కాకుండా వాళ్ల సమస్యలతో సినిమా చేస్తే బాగుంటుంది’ అని సూచించారు. అది నాకు బాగా నచ్చింది. కేటీఆర్‌గారి మాటల స్ఫూర్తితో ఈ సినిమా కథలో ట్రాన్స్‌జెండర్ అనే అంశాన్ని చేర్చాం. సినిమా మొత్తం హిజ్రాల నేపథ్యంలో ఉండదు. కానీ అదొక కీలకమైన పాయింట్‌గా కథ సాగుతుంది. పురాణాల్లో ‘నరకాసురుడు’ రాక్షసుడు కాకముందు గొప్ప రాజు. భూదేవిపుత్రుడు. ఈ సినిమాలో హీరో అలాగే గొప్ప వ్యక్తిత్వంతో ఉంటాడు. రాక్షసుడిగా మారాల్సి వచ్చినప్పుడు మాత్రం నరకాసురుడి కంటే చెడ్డగా మారతాడు. కథానుగుణంగానే టైటిల్ పెట్టాం’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

