Nani HIT 3 OTT | భారీ ధరకు అమ్ముడుపోయిన నాని ‘హిట్ 3’ ఓటీటీ రైట్స్
Nani HIT 3 Movie | అగ్ర కథానాయకుడు నాని సినిమా సినిమాకి తన మార్కెట్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. హయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో హిట్లు అందుకున్న నాని రీసెంట్గా కోర్ట్ సినిమాతో మరో హిట్‌ని ఖాతాలో వేసుకున్నాడు.
Nani HIT 3 Movie | అగ్ర కథానాయకుడు నాని సినిమా సినిమాకి తన మార్కెట్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. హయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో హిట్లు అందుకున్న నాని రీసెంట్గా కోర్ట్ సినిమాతో మరో హిట్‌ని ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం హిట్ 3. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ హిట్ నుంచి వస్తున్న 3వ చిత్రమిది. ఈ చిత్రంలో నాని కథానాయకుడిగా నటించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు. శైలేశ్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండగా.. మే 01న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్‌కి సంబంధించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.54 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారాయి. సినిమా సినిమాకు నాని డిమాండ్ పెరుగుతుండడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్గా కోర్ట్ హిట్టవ్వడం, ఇప్పుడు ఓటీటీ డీల్ చూస్తుంటే నాని పట్టిందల్లా బంగారమవుతుందని టాక్ వినిపిస్తుంది. ఇక హిట్ 3 విషయానికి వస్తే.. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌తో రానున్న ఈ సినిమాలో నాని అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్ ఐపీఎస్ అధికారిగా కనిపించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rib Remodelling | నడుమును సన్నగా మార్చే రిబ్ రీమోడలింగ్ శస్త్ర చికిత్స.. అసలిదేమిటి.. ఏం చేస్తారు..?
Pragya Jaiswal | వెకేషన్ మూడ్‌లో ప్రగ్యా జైస్వాల్.. అదిరిపోయిన అవుట్డోర్ ఫొటోషూట్!
Anirudh-Kavya | అనిరుధ్ -కావ్య మారన్ పెళ్లి సందడి షురూ.. గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్, చెన్నై రిసెప్షన్
Uranium Stockpile: యురేనియంను తరలించనున్న ఇరాన్
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

