తన కొత్త సినిమా ‘దసరా’ విజయంతో ఉత్సాహంలో ఉన్నారు హీరో నాని. తెలంగాణ నేపథ్య కథతో తెరకెక్కిన ఈ సినిమా మాస్ హీరోగా ఎదగాలనే నాని ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లింది. ఈ సినిమా సక్సెస్ సంబరాల నుంచి బయటకొచ్చిన నాని తన కొత్త సినిమా షూటింగ్కు సిద్ధమవుతున్నారు. ‘నాని 30’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు శౌర్యవ్ రూపొందిస్తున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, సీవీ మోహన్ నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ నాయికగా నటిస్తున్నది. జనవరిలో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా ఈ వారంలో రెగ్యులర్ షూటింగ్కు వెళ్తున్నది. గోవాలో తొలి షెడ్యూల్ చిత్రీకరణ మొదలుపెడుతున్నట్లు సమాచారం. 40 రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగనుంది. ఇందులో కీలక సన్నివేశాలను పిక్చరైజ్ చేస్తారని తెలుస్తున్నది. నాని కెరీర్లో ఇదొక భిన్నమైన సినిమా అవుతుందని చిత్రబృందం నమ్మకంతో ఉన్నారు.