Nani Vs Theatre Owners | నాని వర్సెస్ థియేటర్ ఓనర్స్..నువ్వు హీరో కాదు పిరికోడివి..!
కేవలం సినిమాల్లోనే హీరో.. బయట మాత్రం పెద్ద పిరికోడు అంటూ నానిపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఎగ్జిబిటర్స్. దీనికి ఒక కారణం ఆయన టక్ జగదీష్ (Tuck Jagadish) సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 10న నేరుగా విడుదల కానుండటమే.

థియేటర్స్ నా ప్రాణం..థియేటర్లోనే సినిమా చూడాలి..మనం బ్రతికున్నంత వరకు..చనిపోయిన తర్వాత కూడా సినిమా ఉంటుంది..థియేటర్ ఉంటుంది..మన ప్రేక్షకులకు పండగ అంటే థియేటర్ కు వెళ్లి సినిమా చూడడమే.. అలాంటి పండగ ఇప్పుడు మిస్ అవుతున్నాం.. నా సినిమా కూడా థియేటర్ లోనే వస్తుంది.. అంటూ కొన్ని రోజుల కింద తిమ్మరుసు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని (Nani) మాట్లాడాడు. ఇప్పుడు ఇదే మాటలు గుర్తు చేసుకొని థియేటర్ ఎగ్జిబిటర్స్ (Theatre Owners) ఈయనపై మండి పడుతున్నారు. కేవలం సినిమాల్లోనే హీరో.. బయట మాత్రం పెద్ద పిరికోడు అంటూ నానిపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఎగ్జిబిటర్స్. దీనికి ఒక కారణం ఆయన టక్ జగదీష్ (Tuck Jagadish) సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 10న నేరుగా విడుదల కానుండటమే.
దాదాపు 40 కోట్ల మార్కెట్ ఉన్న హీరో సినిమా నేరుగా డిజిటల్ మీడియాలో విడుదల అవుతుండటంతో ఆవేదన చెందుతున్నారు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్. ఇది చాలదన్నట్టు పుండు మీద కారంలా ఏ రోజైతే థియేటర్లో నాగచైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ సినిమాను విడుదల చేస్తున్నారో అదేరోజు టక్ జగదీష్ సినిమాను అమెజాన్ లో స్ట్రీమ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 10న ఓటీటీ వర్సెస్ థియేటర్స్ పెద్ద యుద్ధమే జరగనుంది. దాంతో మీడియా ముందుకు వచ్చారు ఎగ్జిబిటర్స్. నాని సినిమాను నాలుగైదు రోజులు వాయిదా వేసుకోవాలని వాళ్లు కోరుతున్నారు. పండుగ సమయంలో ఓటీటీలో సినిమాలు విడుదలైతే.. థియేటర్ లో వచ్చే కలెక్షన్స్ చాలా దారుణంగా పడిపోతాయని.. ఇప్పటికే సగం చచ్చిపోయిన తమను ఇంకా చంపొద్దు అంటూ వేడుకున్నారు.
నాని లాంటి హీరో బయట ప్రగల్బాలు పలికి.. లోపల మాత్రం తన సినిమాను ఓటిటీలో డబ్బులకు ఆశపడి ఇచ్చుకున్నాడు అంటూ విమర్శిస్తున్నారు ఎగ్జిబిటర్స్. నాని నిజంగా హీరో అయితే వెళ్లి నిర్మాతలతో మాట్లాడి తన సినిమా థియేటర్లో విడుదల చేయాలని.. అంతే గానీ దొంగచాటుగా ఇలా డిజిటల్లో రావడం ఏంటి అంటూ మండిపడుతున్నారు. అది కూడా చేత కాదు అంటే సెప్టెంబర్ 10 కాకుండా ఒక వారం రోజులు ఆగి రావాలని అమెజాన్ తో మంతనాలు చేయాలని వాళ్ళు కోరుతున్నారు. ఏదేమైనా ఇప్పుడు నాని వర్సెస్ థియేటర్ ఎగ్జిబిటర్స్ గొడవ తీవ్ర స్థాయిలో జరుగుతుంది. మరి దీనికి పరిష్కారం ఎక్కడ ఉందో చూడాలి.
ఇవికూడా చదవండి..
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

