బిచ్చగాడు సినిమాతో తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు విజయ్ ఆంటోని (Vijay Antony). మ్యూజిక్ కంపోజర్‌గా, నిర్మాతగా, డైరెక్టర్‌గా మల్టీ టాలెంటెడ్ స్కిల్స్ ఉన్న ఈ యాక్టర్ ప్రస్తుతం హత్య (Hatya) అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. తమిళంలో కొలై టైటిల్‌తో వస్తోంది. ఖిలాడీ ఫేం మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary ) ఈ చిత్రంలో లీల పాత్రలో నటిస్తోంది.
బాలాజీ కే కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ డెత్ మిస్టరీ నేపథ్యంలో సాగనున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమా ట్రైలర్‌ను న్యాచురల్ స్టార్ నాని (Nani ) రేపు సాయంత్రం 6 గంటలకు లాంఛ్ చేయనున్నాడు. ఇన్ఫినిటీ ఫిం వెంచర్స్ అండ్ లోటస్ పిక్చర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. కాగా కొంత కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ ఆంటోనీ ఈ సినిమాపైనే భారీగా ఆశలు పెట్టుకున్నాడు.
ఈ చిత్రానికి గిరీష్ మ్యూజిక్ కంపోజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ చిత్రంలో రితికా సింగ్, రాధికా శరత్ కుమార్, మురళీ శర్మ, జాన్ విజయ్, సంకిత్ బొహ్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు విజయ్ ఆంటోనీ నటిస్తున్న బిచ్చగాడు 2తోపాటు మరో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
#HATYA #హత్య trailer to be launched by Natural Star @NameisNani tomorrow at 6pm.#HATYATRAILER 😇🏆@DirBalajiKumar @ritika_offl @Meenakshiioffl@FvInfiniti @lotuspictures1 @bKamalBohra @Dhananjayang @pradeepfab @siddshankar_ @Panbohra @GskMedia_PR @thinkmusicindia @Bhashyasree pic.twitter.com/IKDBQPE41n
— vijayantony (@vijayantony) August 14, 2022