హైదరాబాద్ కూకట్ పల్లిలోని ప్రముఖ సినీ థియేటర్ శివపార్వతి థియేటర్లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. ఈ క్రమంలోనే నేచురల్ స్టార్ నాని ఈ థియేటర్‌తో తనకున్న తీపి జ్ఞాపకాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
2002లో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘టక్కరి దొంగ’ సినిమా మొదటి షోను ఈ థియేటర్లోనే తాను చూసినట్లు నాని వెల్లడించాడు. ‘‘శివ పార్వతి థియేటర్లో అగ్నిప్రమాదం జరగడం బాధాకరం. ఇక్కడ టక్కరి దొంగ మొదటి షో చూడటం నాకింగా గుర్తే. ఎవరికీ ఎటువంటి గాయాలు అవకపోవడం అదృష్టం’’ అని నాని ట్వీట్ చేశాడు.
కూకట్‌పల్లిలో జాతీయ రహదారి పక్కనే ఉండే శివ పార్వతి థియేటర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని బిగ్స్క్రీన్స్లో ఒకటిగా, మంచి సౌండ్ సిస్టం ఉన్న హాల్‌గా శివ పార్వతి థియేటర్‌కు పేరుంది. ఒకానొక సమయంలో అక్కినేని కుటుంబానికి ఇది లక్కీ థియేటర్‌గా కూడా నిలిచింది.