Nani | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ యాక్టర్ విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ మెజారిటీ స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న విషయం తెలిసిందే. మొదటి ప్రయత్నంలోనే విక్టరీ విజయాన్ని కైవసం చేసుకుని ముఖ్యమంత్రి కాబోతున్న విజయ్‌కు టాలీవుడ్ స్టార్ యాక్టర్ నాని శుభాకాంక్షలు తెలియజేశాడు. విజయ్ విజయాన్ని టాలీవుడ్ నటుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంతో పోలుస్తూ న్యాచురల్ స్టార్ నాని పోస్ట్ పెట్టాడు.
‘విజయ్ సార్‌కు శుభాకాంక్షలు. మొదట అనుమానం వ్యక్తం చేశారు. ఆపై కిరీటం కైవసం చేసుకున్నారు. అప్పుడు మా ఇంట్లో (ఏపీలో) జరిగింది, ఇప్పుడు మా పక్కింటి (తమిళనాడు రాష్ట్రం)లో జరుగుతుంది. బలహీనులు గెలవడం ఎప్పుడూ ఒక అద్భుతమైన సినిమా. తమ నిర్ణయాన్ని స్పష్టంగా ఓటు రూపంలో తెలియజేసిన తమిళనాడు ప్రజల కోసం అద్భుతమైన సేవలందిస్తారని ఆశిస్తున్నానని’ ట్వీట్ చేశాడు నాని. ఇప్పుడీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
నాని ఒకేసారి ఓపెన్‌గా విజయ్ను, పవన్ కల్యాణ్‌ను ప్రశంసించడం అందరి అటెన్షన్‌ను తనవైపునకు తిప్పుకుంటోంది. నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Congratulations @actorvijay sir.
First doubted and then crowned.
Happened at our home and now it’s happening in our neighbouring home.Underdog winning is always absolute cinema ( or should I say absolute politics ?) 🙂
Hope great things follow for the people of Tamil Nadu…— Nani (@NameisNani) May 4, 2026