ఎప్పుడూ ఏదో ఒక షూటింగ్ షెడ్యూల్‌తో బిజీగా ఉండే స్టార్ హీరోలు టైం దొరికితే చాలు ఫ్యామిలీతో సరదాగా గడిపేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇవాళ బాలల దినోత్సవం కాబట్టి పిల్లలందరికీ చాలా ప్రత్యేకమైన రోజు. ఈ సందర్భంగా తన కొడుకుతో విలువైన సమయాన్ని గడిపేందుకు న్యాచురల్ స్టార్ నాని (Nani)షూటింగ్స్ అన్నీ పక్కన పెట్టేశాడు. కొడుకు అర్జున్‌తో కలిసి కాలిఫోర్నియాలోని డిస్నీ ల్యాండ్ (Disney Land) కు వెళ్లాడు నాని .
అక్కడ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచే ది పార్ట్నర్స్ స్టాచ్యూ (Partners statue) ముందు నాని-అర్జున్ అచ్చం అలాగే నిలబడి కెమెరాకు ఫోజులిచ్చారు. అర్జున్ మిక్కీ మౌస్లా డ్రెస్ వేసుకుని.. క్యూట్ క్యూట్ ఫోజులిచ్చాడు. నాని ఈ సందర్భంగా పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాడు. నాని అర్జున్‌తోపాటు మరో పిల్లాడిని స్టాచ్యూ దగ్గరకు ఎత్తుకెళ్తున్న వీడియోతోపాటు స్టాచ్యూ ముందు అర్జున్‌తో కలిసి దిగిన ఫొటో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
నాని ప్రస్తుతం డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న దసరా చిత్రంలో నటిస్తున్నాడు. నేషనల్ అవార్డు విన్నింగ్ నటి కీర్తిసురేశ్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లతోపాటు మాస్ సాంగ్‌కు అద్బుతమైన స్పందన వస్తోంది.
కొడుకు అర్జున్‌తో నాని.. వీడియో