నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘హాయ్ నాన్న’. శౌర్యువ్ దర్శకుడు. వైర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి, డా॥ విజయేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని ‘సమయమా భలే సాయం చేశావమ్మా’ అనే తొలి గీతాన్ని శనివారం విడుదల చేశారు. ‘సమయమా భలే సాయం చేశావమ్మా, కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా..’ అంటూ చక్కటి సాహిత్యంతో ఈ పాట సాగింది.
హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరచిన ఈ గీతాన్ని అనంత్‌శ్రీరామ్ రచించారు. నాయకానాయికలు నాని, మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీతో పాటు విజువల్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, దర్శకత్వం: శౌర్యువ్.