Venkatesh – Anil Ravipudi | వెంకటేష్ – అనిల్ రావిపూడి మూవీ సెట్స్‌లో సందడి చేసిన బాలకృష్ణ
Venkatesh – Anil Ravipudi | టాలీవుడ్ సీనియర్ నటులు నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్‌లు ఒకే చోట కలుసుకున్నారు. రామోజీ ఫిలిం సిటీ వేదికగా అనిల్ రావిపూడి - వెంకటేశ్ ప్రాజెక్ట్ షూటింగ్ జరుగుతుండగా.. ఈ షూటింగ్ సెట్స్‌లో బాలయ్య వచ్చి సందడి చేశాడు.
Venkatesh – Anil Ravipudi | టాలీవుడ్ సీనియర్ నటులు నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్‌లు ఒకే చోట కలుసుకున్నారు. రామోజీ ఫిలిం సిటీ వేదికగా అనిల్ రావిపూడి – వెంకటేశ్ ప్రాజెక్ట్ షూటింగ్ జరుగుతుండగా.. ఈ షూటింగ్ సెట్స్‌లో బాలయ్య వచ్చి సందడి చేశాడు. భగవంత్ కేసరితో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ నటుడు విక్టరీ వెంకటేశ్ స్టార్ అనిల్ రావిపూడి కాంబోలో ఈ మూవీ తెరకెక్కబోతుంది.
ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం రాబోతుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ చిత్రం కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రానుంది. ఇప్పటికే తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో ఉన్న దర్బార్ హాల్లో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సెట్స్‌లో నందమూరి బాలకృష్ణ వచ్చి అందరికి సర్ప్రైజ్ ఇచ్చాడు. అనంతరం వెంకటేశ్, అనిల్ రావిపూడితో కలిసి ముచ్చటించాడు బాలయ్య. ఇక బాలయ్య సెట్స్‌కి వచ్చిన ఫొటోలను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
Sparking excitement all around 🤩✨
Natasimham #NandamuriBalakrishna garu graced the sets of #VenkyAnil3 during the latest schedule at RFC 💥It was a delight to witness the dynamic camaraderie between #NBK, Victory @VenkyMama, and @AnilRavipudi ❤️🔥#SVC58 shoot in progress 💥… pic.twitter.com/9tlqUrcUgG
— Sri Venkateswara Creations (@SVC_official) September 21, 2024
ఈ ప్రాజెక్ట్‌లో కథానాయికలుగా మీనాక్షి చౌదరితో పాటు ఐశ్వర్య రాజేష్ నటించబోతుండగా.. ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్ వెంకటేశ్ భార్యగా నటించనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
మరోవైపు బాలకృష్ణ ఎన్బీకే 109 అనే సినిమా చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య వంటి సూపర్ హిట్ అందుకున్న కేఎస్ రవీంద్ర (బాబీ) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. సితార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తుంది.
Also Read..
- Shubhman Gill: గిల్ అయిదవ సెంచరీ.. బంగ్లాదేశ్ టార్గెట్ 515
- KTR | కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత సీతారాం ఏచూరి : కేటీఆర్
- Devara Release Trailer | ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి మరో ట్రైలర్.?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

