Tarakaratna | పాపం తారకరత్న..చివరి కోరిక తీరకుండానే వెళ్లిపోయాడుగా..!
Tarakaratna | నందమూరి కుటుంబంలోనే కాదు.. అభిమానుల్లోనూ ఊహించని షాక్ తారకరత్న మరణం. ఆయన అస్వస్థతకు గురైన రోజే గుండె ఆగిపోయిందని.. 45 నిమిషాల తర్వాత మళ్లీ కొట్టుకుందని అందరూ చెప్పడంతో అప్పట్నుంచే ఆయన ఆరోగ్యంపై అనుమానాలున్నాయి.
Tarakaratna | నందమూరి కుటుంబంలోనే కాదు.. అభిమానుల్లోనూ ఊహించని షాక్ తారకరత్న మరణం. ఆయన అస్వస్థతకు గురైన రోజే గుండె ఆగిపోయిందని.. 45 నిమిషాల తర్వాత మళ్లీ కొట్టుకుందని అందరూ చెప్పడంతో అప్పట్నుంచే ఆయన ఆరోగ్యంపై అనుమానాలున్నాయి. కానీ ఫారెన్ డాక్టర్స్ వస్తున్నారు.. ఆరోగ్యం మెరుగుపడుతుందని కుటుంబ సభ్యులు చెప్పడంతో నమ్మారు ఫ్యాన్స్. అయితే చివరికి పూజలు నెరవరలేదు.. దేవుడు కరుణించలేదు.. 39 ఏళ్ళ వయసులోనే ఆయన అందర్నీ విడిచి వెళ్లిపోయాడు. తారకరత్న మరణం కంటే ఆయన చివరి కోరిక తీరకుండానే వెళ్లిపోయాడు అనే బాధే అభిమానుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. తారకరత్న ఎప్పుడూ తనకోసం ఏమీ కోరుకోలేదని.. జనం కోసం, పార్టీ కోసమే తాపత్రయపడేవాడని అతడితో ఉన్నవాళ్లు చెప్తున్న మాట. ముఖ్యంగా ఏడాదిగా రాజకీయ భవిష్యత్తు కోసం చాలా కష్టపడ్డాడు తారకరత్న.
తనను తాను మార్చుకున్నాడు.. అలవాట్లు కూడా ఎన్నో మార్పులు చేసుకున్నాడు. రాజకీయాల్లో బిజీ కావాలని నిర్ణయించుకున్నపుడే.. జనంతో ఎక్కువగా మమేకం అయ్యాడు. పార్టీ కోసం అహర్నిషలు కష్టపడ్డాడు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్‌తోనే ఎక్కువ రోజులు టైమ్ స్పెండ్ చేశాడు. చివరికి లోకేష్ పాదయాత్రలోనే కుప్పకూలిపోయాడు. పాదయత్ర మొదలు పెట్టినరోజే తనకు చివరి రోజు అవుతుందని కలలో కూడా ఊహించి ఉండడు తారకరత్న. ఆ రోజు పడిన తర్వాత.. చనిపోయే వరకు కనీసం కన్ను కూడా తెరవలేదు ఈయన. అయితే వచ్చే ఎన్నికల్లో తాత స్థాపించిన పార్టీ నుంచి పోటీ చేయాలని.. ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు మంచి చేయాలని ఎన్నో కలలు కన్నాడు తారకరత్న. ఇప్పట్నుంచి తన జీవితంలో ప్రతి రోజూ జనం కోసమే అంటూ చెప్పుకొచ్చాడు. దానికోసమే రాత్రింబవళ్లు కష్టపడ్డాడు కూడా. కానీ ఏం లాభం.. రాజకీయంగా తొలి అడుగులు వేస్తున్న సమయంలోనే దేవుడు చిన్న చూపు చూశాడు. అప్పటి వరకు ఆరోగ్యంగా కనిపించిన తారకరత్న.. కార్డియక్ అరెస్ట్‌తో కన్నుమూశాడు.
బాబాయ్ బాలయ్యతో కలిసి నటించాలనేది కూడా తారకరత్న కల. ఆ డ్రీమ్‌కు అడుగు దూరంలోనే ఉన్నాడు ఈయన. ఎందుకంటే ప్రస్తుతం బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమాలో తారకరత్న విలన్ పాత్ర కోసం ఎంపికయ్యాడు కూడా. అయితే అంతలోనే తీరని విషాదం జరిగిపోయింది. బాబాయ్‌తో నటించకుండానే తనువు చాలించాడు తారకరత్న. అంతేకాదు.. రాజకీయంగా ఎంతో సాధించాలని తాపత్రయపడిన తారకరత్న.. అర్ధాంతరంగా అందర్నీ విడిచి వెళ్లిపోయాడు.
Read More :
“Taraka Ratna | సినిమాను తలపించేలా తారకరత్న ప్రేమపెళ్లి”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసం చేసిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

