Taraka Ratna | ఆ సినిమాకు ఉత్తమ విలన్‌గా తారకరత్నకు నంది అవార్డు
నందమూరి తారకరత్న 20ఏళ్లకే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2002లో 'ఒకటో నెంబర్కుర్రాడు' సినిమాతో హీరోగా తెరంగ్రేటం చేశాడు. కమర్షియల్‌గా ఈ సినిమా అంతగా ఆడకపోయినా.. తారకరత్న నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.
Taraka Ratna | నందమూరి తారకరత్న 20ఏళ్లకే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2002లో ‘ఒకటో నెంబర్కుర్రాడు’ సినిమాతో హీరోగా తెరంగ్రేటం చేశాడు. కమర్షియల్‌గా ఈ సినిమా అంతగా ఆడకపోయినా.. తారకరత్న నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత ‘తారక్’, ‘భద్రాద్రిరాముడు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే హీరోగా కంటే తారకరత్న విలన్‌గానే ఎక్కువగా పాపులారిటీ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘అమరావతి’ సినిమా తారకరత్నకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఈ సినిమాలో తారకరత్న శ్రీను అనే నెగెటీవ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశాడు. ఇక ఇందులో తారకరత్న పండించిన విలనిజంకు ఆయన్ను నంది అవార్డు వరించింది. అంతలా తన పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. దీనితో పాటుగా మరో రెండు సినిమాల్లో విలన్ పాత్రలు పోషించాడు. హీరోగా అంతగా సక్సెస్ కాకపోయినా.. విలన్‌గా మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. చివరగా తారకరత్న అగ్ర దర్శకుడు క్రిష్ జాగర్లమూడి క్రియేట్ చేసిన ‘9అవర్స్’ వెబ్ సిరీస్‌లో నటించాడు. ఈ వెబ్ సిరీస్ తారకరత్నకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అంతకుముందు ‘సారధి’ అనే సినిమా చేశాడు. అదే తారకరత్న చివరి చిత్రం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

