Taraka Ratna | ఒకేసారి 9 సినిమాలతో లాంచింగ్.. తారకరత్న రేరెస్ట్ రికార్డు
బోలెడంత టాలెంట్, చక్కటి రూపం ఉన్నా తారకతర్నకు అదృష్టం కలిసి రాలేదు. కెరీర్ బిగెనింగ్‌లో రాకెట్లా దూసుకుపోయిన తారకరత్న.. ఆ తర్వాత డౌన్ అయ్యాడు. హీరోగా క్రేజ్ తగ్గినా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలనే ఆరాటంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా చివరి వరకు నటించాడు.
Taraka Ratna Record | బోలెడంత టాలెంట్, చక్కటి రూపం ఉన్నా తారకతర్నకు అదృష్టం కలిసి రాలేదు. కెరీర్ బిగెనింగ్‌లో రాకెట్లా దూసుకుపోయిన తారకరత్న.. ఆ తర్వాత డౌన్ అయ్యాడు. హీరోగా క్రేజ్ తగ్గినా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలనే ఆరాటంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా చివరి వరకు నటించాడు. నటుడిగా ఎప్పటికప్పుడు తనను తానూ కొత్తగా ఆవిష్కరిస్తూనే వచ్చాడు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఫలితం తేడా కొట్టినా ఎప్పుడు వెనకడుగు వేయలేదు. ఇక ఇదిలా ఉంటే తారకరత్న పేరిట ఒక రేరెస్ట్ రికార్డు ఉంది. ఇప్పటివరకు ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదు.. ఇకపై బ్రేక్ చేయలేరు కూడా.
ఇంతకీ ఆ రికార్డు ఎంటా అనుకుంటున్నారా? అదేంటంటే తారకరత్న 2002లో ఒకేసారి తొమ్మిది సినిమాలతో లాంచ్ అయ్యాడు. ఒకే రోజు ఒకే ముహూర్తంలో ఇన్ని సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన ఏకైక హీరో అనే రేరెస్ట్ రికార్డు ఇంకా తారకరత్న ఖాతాలోనే ఉంది. ముహూర్తం పూర్తి చేసుకున్న తొమ్మిది సినిమాల్లో ఐదు మాత్రమే విడుదలకు నోచుకున్నాయి. కెరీర్ బిగెనింగ్‌లో లవర్ బాయ్ పేరుతెచ్చుకున్న తారకరత్న.. రవిబాబు ప్రోత్సాహంతో ‘అమరావతి’ సినిమాతో విలన్‌గా మారి కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఈ సినిమాలో తారకరత్న నటనకు విలన్‌గా నంది అవార్డు వరించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

