బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రం
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. బ్లాక్‌బస్టర్ ‘హను-మాన్’ ఫేం ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి తన ఎస్వీఎల్ సినిమాస్‌పై లెజెండ్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు.
బాలకృష్ణ చిన్నకుమార్తె తేజస్విని ఈ సినిమాకి సమర్పకురాలు కావడం విశేషం. శుక్రవారం మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని ైస్టెలిష్ అండ్ మోడరన్ అవతార్‌లో ప్రజెంట్ చేస్తూ ఓ స్టిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో ఆకర్షణీయమైన చిరునవ్వుతో, మెస్మరైజింగ్ ప్రజెన్స్‌తో చాలా అందంగా కనిపిస్తున్నారు మోక్షజ్ఞ.
ప్రశాంత్‌వర్మ మాట్లాడుతూ ‘మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే అవకాశం రావడం గొప్ప గౌరవంగా, అంతకంటే పెద్ద బాధ్యతగా భావిస్తున్నా. ఇది ఇతిహాసాల నుంచి స్పూర్తి పొందిన స్క్రిప్ట్. ప్రశాంత్ వర్మ సినిమా యూనివర్స్‌లో ఇది ఒక భాగం. నా యూనివర్స్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లే సినిమా అవుతుంది. ప్రస్తుతం మోక్షూ నటశిక్షణలో ఉన్నారు. డ్యాన్స్, ఫైట్లు.. ఇలా ప్రతి విషయంలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు.
ఈ సినిమాతో ఓ గొప్ప స్టార్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్న క్రెడిట్ నాకు దక్కనున్నది’ అని ఆనందం వ్యక్తం చేశారు. ‘మోక్షజ్ఞని హీరోగా లాంచ్ చేసే సువర్ణావకాశాన్ని మాకిచ్చిన బాలకృష్ణగారికి కృతజ్ఞతలు. ప్రశాంత్‌వర్మ అద్భుతమైన స్క్రిప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తాం’ అని నిర్మాత సుధాకర్ చెరుకూరి తెలిపారు.
ఎన్టీఆర్ విషెస్
ఇదిలావుంటే.. మోక్షజ్ఞ తెరంగేట్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావడంతో ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ఇద్దరూ తన ఎక్స్(ట్విటర్) ద్వారా మోక్షజ్ఞకు శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం. ‘తాతగారి ఆశీస్సులతో నువ్వు పెద్ద హీరోగా ఎదగాలి’ అంటూ తారక్, కల్యాణ్‌రామ్ తన ట్విటర్స్లో పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | సన్నీ డియోల్ చిత్రం ‘సూర్య’కు హైకోర్టులో ఊరట.. విడుదలపై స్టే నిరాకరణ!
Stock Markets: దలాల్ స్ట్రీట్‌లో దివాళీ ధమాకా.. దూసుకెళ్తున్న స్టాక్‌మార్కెట్లు.. ఇన్వెస్టర్లకు 7 లక్షల కోట్ల బొనాంజా
Virat Kohli: విరాట్ కోహ్లీ 38వ బర్త్‌డే.. విషెస్ చెప్పిన బీసీసీఐ
Water Crisis | తాగేందుకు నీళ్లు లేవు.. బాత్రూంకూ బయటకే వెళ్లాల్సిన దుస్థితి.. బషీరాబాద్ ఎస్సీ హాస్టల్లో నీటి కష్టాలు!
సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం.. PURE EV స్కూటీ తయారీ కంపెనీలో ఎగిసిపడుతున్న మంటలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

