Bimbisara Movie | ‘బింబిసార’ చిత్రాన్ని వీక్షించిన బాలయ్య.. కళ్యాణ్రామ్పై పొగడ్తల వర్షం
Balakrishna Watched Bimbisara Movie | నందమూరి కళ్యాణ్‌రామ్ చాలా కాలం తర్వాత ‘బింబిసార’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. ‘పటాస్’ తర్వాత దాదాపు 8 ఏళ్ళకు బింబిసారతో కమర్షియల్ హిట్‌ను సాధించాడు. భారీ అంచనాల నడుమ ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండి పాజిటీవ్ టాక్‌ను తెచ్చుకొని వసూళ్ళ సునామీని సృష్టిస్తుంది. కళ్యాణ్‌రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా బింబిసార నిలిచింది. కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బింబిసారుడి పాత్రలో ఒదిగిపోయాడు. దర్శకుడు మల్లిడి వశిష్ఠ డెబ్యూ సినిమానే అయినా.. తన టేకింగ్‌కు, పాత్రలను మలిచిన విధానంకు సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు చిత్రాన్ని వీక్షించి బింబిసార బృందాన్ని అభినందిస్తున్నారు. తాజాగా బాలకృష్ణ బింబిసార చిత్రాన్ని వీక్షించాడు.
తాజాగా బాలకృష్ణ, కళ్యాణ్ రామ్‌తో కలిసి బింబిసార సినిమా చూశాడు. డైరెక్టర్ వశిష్ట, టీం కూడా బాలయ్యతో పాటు సినిమా చూశారు. సినిమా చాలా బావుందని.. బాలయ్య, కళ్యాణ్ రామ్‌తో పాటు బింబిసార టీంకు అభినందనలు తెలిపాడు. బాలకృష్ణతో పాటు కళ్యాణ్‌రామ్ సోదరి సుహాసిని, భార్య స్వాతి కూడా బింబిసార చిత్రాన్ని చూశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఫాంటిసీ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్‌రామ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. కళ్యాణ్‌రామ్‌కు జోడీగా కేథరీన్ ట్రెసా, సంయుక్త మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. కీరవాణి సంగీతం అందించాడు. ఇక ఇప్పటికే ఈ చిత్రం కళ్యాణ్‌రామ్‌కు దాదాపు 10కోట్లకు పైగా ప్రాఫిట్స్ను తెచ్చిపెట్టింది.
Some special pictures from the special screening of #Bimbisara for Natasimham #NandamuriBalakrishna garu❤️
The team is all smiles & pumped up with roaring energy 💥🔥@NANDAMURIKALYAN @DirVassishta pic.twitter.com/AbUWQJnpRM
— NTR Arts (@NTRArtsOfficial) August 13, 2022

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

