Namratha Shirodkar | మామయ్య కృష్ణకు నమ్రత శిరోద్కర్ నివాళి.. ట్రెండింగ్‌లో వీడియో
సూపర్ స్టార్ కృష్ణకు ఆయన కోడలు నమ్రతా శిరోద్కర్ (Namratha Shirodkar) ఘనంగా నివాళులర్పించింది. ఈ వీడియో చూసిన అభిమానులు, ఫాలోవర్లు సోషల్ మీడియాలో తెగ షేర్లు చేస్తున్నారు.
ఇటీవలే సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) ప్రేక్షకులు, అభిమానుల నుంచి భౌతికంగా దూరమైన విషయం తెలిసిందే. కృష్ణ మరణం పట్ల టాలీవుడ్‌తోపాటు యావత్ సినీ లోకం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. కాగా కృష్ణకు ఆయన కోడలు నమ్రతా శిరోద్కర్ (Namratha Shirodkar) ఘనంగా నివాళులర్పించింది. కృష్ణ సినీ ప్రయాణం, మైలురాళ్లు, రికార్డులతో డిజైన్ చేసిన రీల్‌ను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది నమ్రతా శిరోద్కర్.
ఈ వీడియో చూసిన అభిమానులు, ఫాలోవర్లు సోషల్ మీడియాలో తెగ షేర్లు చేస్తున్నారు. ఇవాళ ఘట్టమనేని కుటుంబసభ్యులు హైదరాబాద్‌లో కృష్ణ దశ దిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు రాబోతున్నారు.
హైదరాబాద్‌లో కృష్ణ జ్ఞాపకార్థం ఘట్టమనేని కుటుంబసభ్యులంతా కలిసి మెమోరియల్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నద్దమవుతున్నారు. మెమోరియల్‌కు సంబంధించిన వివరాలపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం.
మెమోరియల్‌లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహంతోపాటు ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన ఫొటోలు, ఇతర విశేషాలు అందుబాటులో ఉండనున్నాయి. మెమోరియల్‌ను పద్మాలయ స్టూడియోస్‌లో ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోండగా.. పూర్తి వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
సూపర్ స్టార్ కృష్ణకు నమ్రత శిరోద్కర్ నివాళి.. వీడియో
Read Also : Gurthunda Seetakalam | గుర్తుందా శీతాకాలం నుంచి మరో క్రేజీ అప్డేట్ టైం ఫిక్స్
Read Also : Mahesh Babu | నాన్న నాకిచ్చిన గొప్ప బహుమానం అదే.. మహేశ్ బాబు స్పీచ్ వైరల్
Read Also : Orange | ఆరెంజ్ రీ రిలీజ్‌పై నిర్మాత నాగబాబు క్లారిటీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

