Phalana Abbayi Phalana Ammayi | అందరి మనసుల్ని గెలుచుకుంటుంది
నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. శ్రీనివాస్ అవసరాల దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి నిర్మిస్తున్నారు.
నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. శ్రీనివాస్ అవసరాల దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి నిర్మిస్తున్నారు. మాళవిక నాయర్ కథానాయిక. ఈ నెల 17న విడుదలకానుంది. శనివారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించడంతో పాటు చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం భాస్కరభట్ల, లక్ష్మీభూపాల అద్భుతమైన పాటల్ని అందించారు. కల్యాణిమాలిక్ సంగీతం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నది. దర్శకుడిగా నా కెరీర్లోఎంతో ప్రత్యేకమైన చిత్రమిది’ అన్నారు.
‘శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాకిది మూడో చిత్రం. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. కల్యాణిమాలిక్గారు పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ప్రాణం పోశారు. ఈ సినిమా రికార్డులు బద్దలు కొడుతుందని చెప్పను కానీ..మీ అందరి మనసుల్ని గెలుచుకుంటుంది. దీని తర్వాత పది ఫ్లాపులు తీసినా క్షమిస్తారు. అంత మంచి సినిమా ఇది’ అని నాగశౌర్య తెలిపారు. చక్కటి ప్రేమకథా చిత్రంలో భాగం కావడం ఆనందంగా ఉందని కథానాయిక మాళవిక నాయర్ పేర్కొంది. కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్ చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్శకులు బాబీ కొల్లి, మారుతి, నందిని రెడ్డి, కోన వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

