Lenin | అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ ‘లెనిన్’ సినిమా గురించి గత కొంతకాలంగా పలు రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రిలీజ్ వాయిదా పడిందన్న వార్తలు అభిమానులను కలవరపరిచాయి. అయితే ఇప్పుడు ఆ అనుమానాలన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తూ కింగ్ నాగార్జున అక్కినేని స్వయంగా క్లారిటీ ఇచ్చారు.దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. మాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇటీవల ఈ సినిమా ఫస్ట్ కట్‌ను చూసిన నాగార్జున, తన ట్వీట్‌తో ఫ్యాన్స్‌కు గట్టి బూస్ట్ ఇచ్చారు. “లెనిన్ ఫస్ట్ కట్ చూశాను.. చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను, మీరు ఒక కొత్త అఖిల్‌ను చూడబోతున్నారు” అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అఖిల్ కెరీర్లో ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందనే సంకేతాలు ఆయన మాటల్లో కనిపిస్తున్నాయి.ఇదే సందర్భంలో రిలీజ్ డేట్‌పై కూడా నాగార్జున స్పష్టత ఇచ్చారు. అన్ని రూమర్స్‌కు చెక్ పెడుతూ జూన్ 26న ‘లెనిన్’ గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల అవుతుందని ప్రకటించారు. దీంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌కు ఈ సినిమా కీలకంగా మారింది.
ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఆయన బీజీఎం, పాటలు ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక నిర్మాణ బాధ్యతలను నాగార్జునతో పాటు ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్వహిస్తున్నారు.టెక్నికల్‌గా కూడా హై స్టాండర్డ్స్‌తో తెరకెక్కుతున్న ‘లెనిన్’లో యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ అన్నీ సమపాళ్లలో ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది. అఖిల్ ఈ సినిమాలో కొత్త లుక్, బాడీ లాంగ్వేజ్‌తో కనిపించనున్నాడని సమాచారం. అఖిల్.. ‘లెనిన్’తో నిజంగానే బాక్సాఫీస్ వద్ద మాస్ హిట్ కొడతాడా..? అన్నది ఆసక్తికరంగా మారింది.