అగ్ర కథానాయకుడు నాగార్జున నటిస్తున్న వందో చిత్రానికి ‘కింగ్ 100’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం నాగార్జున జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘మనుషుల్లో రెండు రకాలు..ఒకటి డబ్బున్న వాళ్లు, రెండు డబ్బులేని వాళ్లు’ అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్‌తో టీజర్ మొదలైంది. ఇందులో నాగార్జున ైస్టెలిష్ అండ్ డైనమిక్ అవతారంలో కనిపించారు.
ఆర్థిక నేరాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారని గ్లింప్స్‌ను బట్టి అర్థమవుతున్నది. ‘ఐడెంటిటీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దేన్ మనీ…దానిని నిలబెట్టుకోవడానికి పరుగెడుతూనే ఉండాలి’ అని గ్లింప్స్ చివరలో వచ్చే డైలాగ్ సినిమాలో చర్చించిన మెయిన్ పాయింట్‌ను తెలియజేసేలా ఉంది. నాగార్జున తనదైన స్క్రీన్‌ప్రజెన్స్, యాటిట్యూడ్, ైస్టెలిష్ లుక్స్‌తో ఆకట్టుకున్నారు. గ్రాండ్ విజువల్స్‌తో పాటు దేవిశ్రీప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్‌లో హైలైట్‌గా నిలిచింది. టబు కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజా మహదేవన్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాణ సంస్థ: అన్నపూర్ణ స్టూడియోస్, రచన-దర్శకత్వం: రా కార్తీక్.