మూగవాడి ప్రేమకథ ‘ఇట్లు అర్జున’
‘ఈ సినిమా కాన్సెప్ట్ నచ్చడంతో గ్లింప్స్‌కి వాయిస్ ఓవర్ ఇచ్చాను. కొత్త టాలెంట్ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటివారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటాను.
‘ఈ సినిమా కాన్సెప్ట్ నచ్చడంతో గ్లింప్స్‌కి వాయిస్ ఓవర్ ఇచ్చాను. కొత్త టాలెంట్ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటివారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటాను. ఇప్పటికే మా అన్నపూర్ణ సంస్థలో చాలా మంది కొత్తవారిని పరిచయం చేశాం. ఈ సినిమా చూశాను. బాగా నచ్చింది. అందుకే సమర్పకుడిగా వ్యవహరించడానికి ముందుకొచ్చాను.
ఈ సినిమాలో భాగం కావడం గర్వంగా ఉంది’ అన్నారు అగ్ర నటుడు అక్కినేని నాగార్జున. అనీష్ హీరోగా మహేష్ ఉప్పల దర్శకత్వంలో వెంకీ కుడుముల నిర్మిస్తున్న ‘ఇట్లు అర్జున’ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది. నాగార్జున సమర్పణలో ఈ సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.
తొలి సినిమాతోనే హీరో అనీష్ మూగవాడి పాత్రను చేస్తూ ప్రయోగానికి సిద్ధమయ్యారని, అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో ఈ సినిమాను తెరకెక్కించారని నాగార్జున ప్రశంసించారు. హృద్యమైన ప్రేమకథ ఇదని, కథలోని ములుపులు ఉత్కంఠను పంచుతాయని నిర్మాత వెంకీ కుడుముల తెలిపారు. దర్శకుడిగా తన తొలి చిత్రం నాగార్జునగారి సమర్పణలో విడుదల కావడం అదృష్టంగా భావిస్తున్నానని దర్శకుడు మహేష్ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

