Nagabandham | పెదకాపు ఫేం విరాట్ కర్ణ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం నాగబంధం (Nagabandham). వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ అభిషేక్ నామా డైరెక్ట్ చేస్తున్నాడు. అడ్వెంచరస్ మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ మూవీ టీజర్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో వస్తోన్న నాగబంధం చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో జులై 3న విడుదల చేయనున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత నిషితా నాగిరెడ్డి పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది.
సినిమా మొత్తం ఒకే పంథాలో సాగదు.. ప్రతీ పది నిమిషాలకోసారి ప్రేక్షకులు భిన్నమైన విజువల్ ఎక్స్పీరియన్స్ ను పొందుతారు. చాలా సినిమాల్లో ఒకే సెటప్స్, సెట్స్ మళ్లీ మళ్లీ వినియోగిస్తుంటారు.. నాగబంధంలో ప్రతీ ప్రపంచం చాలా కొత్తదనంతో విభిన్నంగా ఉండాలనుకున్నాం. మేం ముందుగా అనుకున్న దాని కంటే 4-5 రెట్లు ఎక్కువగా బడ్జెట్ పెరిగింది. కానీ సినిమా అవుట్‌పుట్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే మేం క్రియేట్ చేస్తున్న కంటెంట్, దాని ప్రత్యేకతలను ఎక్కువగా నమ్మామని చెప్పుకొచ్చింది నిషితా నాగిరెడ్డి.
నాగబంధం చిత్రంలో ఇస్మార్ట్ భామ నభానటేశ్, ఐశ్వర్య మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, నిక్ స్టూడియోస్, తారక్ సినిమాస్ బ్యానర్లపై అభిషేక్ నామా, కిశోర్ అన్నపురెడ్డి, లక్ష్మి ఐరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తెరకెక్కించి డెవిల్ తర్వాత అభిషేక్ నామా నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ్ ఆలయాల్లో గుప్త నిధుల ఆవిష్కరణల స్పూర్తిగా వస్తోన్న ఈ చిత్రంలో వచ్చే క్లైమాక్స్ ఇదివరకెన్నడూ చూడని విధంగా ఉండబోతుందట.
అన్ని రంగాల్లో నల్లగొండను అభివృద్ధి పరిచేందుకు కృషి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
Gorilla’s Reaction | గర్ల్ ఫ్రెండ్‌తో గొడవ.. అచ్చం మనిషిలాగే బాధపడుతున్న మగ గొరిల్లా.. Video viral