హీరో నాగశౌర్య అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. విధి కథానాయిక. రామ్ దేశినా దర్శకుడు. శ్రీనివాసరావు చింతలపూడి నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ని వేగవంతం చేశారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చిందని మేకర్స్ చెబుతున్నారు. తాజాగా ఈ సినిమాలోని తొలి పాటను విడుదల చేశారు.
‘నా మావ పిల్లనిత్తానన్నాడే..’ అంటూ సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా, హేరిస్ జైరాజ్ స్వరపరిచారు. కారుణ్య, హరిప్రియ కలిసి ఆలపించారు. నాగశౌర్య, విధి కెమిస్ట్రీ ఈ పాటలో చాలా కలర్ఫుల్గా ఉంటుందని, వారి డాన్స్ మూమెంట్స్ కూడా ఆకట్టుకుంటాయని మేకర్స్ చెబుతున్నారు. సీనియర్ నరేష్, సాయికుమార్, సముద్రఖని, శ్రీదేవి విజయ్‌కుమార్, వెన్నెల కిశోర్, మైమ్ గోపీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రసూల్ ఎల్లోర్, నిర్మాణం: శ్రీవైష్ణవి ఫిల్మ్స్.