Varudu kavalenu movie final collections | యువ హీరో నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం వరుడు కావలెను. ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమైంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు వినూత్నంగా ఉండటంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఈ సినిమా నుంచి వచ్చిన దిగు దిగు నాగ వంటి సాంగ్స్‌ను యూత్‌ను ఉర్రూతలూగించాయి. దీనికి తగ్గట్టుగానే అక్టోబర్ 29న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. అదే రోజు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ, కేతిక శర్మ నటించిన రొమాంటిక్ సినిమా కూడా విడుదలైంది. కానీ అందులో గ్లామర్ డోస్ ఎక్కువగా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం వరుడు కావలెను సినిమాకే ఇంట్రెస్ట్ చూపించారు. కానీ యూత్ మాత్రం రొమాంటిక్ చిత్రానికి మొగ్గు చూపారు. ఇది కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇప్పుడు వరుడు కావలెను సినిమా ఫైనల్ కలెక్షన్స్ వచ్చేశాయి.
నైజాం: 1.30 కోట్లు.
సీడెడ్: 0.52 కోట్లు.
ఉత్తరాంధ్ర: 0.55 కోట్లు.
గుంటూరు: 0.37 కోట్లు.
ఈస్ట్: 0.31 కోట్లు.
వెస్ట్: 0.26 కోట్లు.
కృష్ణ: 0.34 కోట్లు.
నెల్లూరు: 0.23 కోట్లు.
ఏపీ+తెలంగాణ(టోటల్): 3.88 కోట్లు.
రెస్ట్ ఆఫ్ ఇండియా: 0.22 కోట్లు.
ఓవర్సీస్: 0.98 కోట్లు.
వరల్డ్ వైడ్(టోటల్): 5.08 కోట్లు.
వరుడు కావలెను చిత్రం రూ.8.55 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో రంగంలోకి దిగి ఫుల్ రన్ ముగిసే సరికి రూ.5.08 కోట్ల షేర్‌ను మాత్రమే కలెక్ట్ చేసింది. బయ్యర్లకు రూ.3.47 కోట్ల నష్టాలను మిగిల్చింది. ఛలో సినిమా తరువాత ఆ స్థాయి హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగశౌర్య కు ఈ చిత్రం కూడా నిరాశనే మిగిల్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Ritu Varma | పెళ్లికి తొందరేం లేదు!
Ritu Varma | రీతూ వర్మ కొంటె చూపులకు కుర్రకారు ఫిదా..
Tollywood: టాలీవుడ్లో తెలుగు అందాల సందడి..!
పరభాషలో సత్తా చాటుతున్న తెలుగమ్మాయిలు