టాలీవుడ్ ( Tollywood) హీరోలు వెంకటేశ్ (Venkatesh ), వరుణ్ తేజ్ (Varun Tej) కాంబినేషన్ లో వస్తున్న ప్రాజెక్టు ఎఫ్3 (F3). మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah), మెహరీన్ కౌర్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఎఫ్ 3కి సీక్వెల్గా వస్తున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రాంఛైజీ ఫ్యాన్ రత్తమ్మతో కలిసి సరికొత్తగా ప్రమోషన్స్ మొదలుపెట్టాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోగా..పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి.
తాజాగా నాగరత్తమ్మ ఎఫ్ 3 సెట్స్ లోకి ప్రవేశించి నానా రభస సృష్టించింది. మొదట అనిల్ రావిపూడి పలుకరించి…ఆ తర్వాత బిల్డింగ్ పై ఉన్న వరుణ్, వెంకీ దగ్గర తిష్ట వేసింది నాగ రత్తమ్మ. ఎఫ్ 2లో లాగా ఫ్రస్టేషన్ తగ్గించుకోవడానికి ఎఫ్ 3లో ఎలాంటి సీన్లు ఉండబోతున్నాయని ఇద్దరినీ అడుగుతుంది నాగరత్తమ్మ. సెట్స్ లో శ్రీనివాస్ రెడ్డి, అన్నపూర్ణమ్మ, ప్రగతి, రాజేంద్రప్రసాద్ లాంటి నటీనటులతో ఫన్నీ సంభాషణ జరిపింది. రత్తమ్మ ఎఫ్ 3 సెట్స్ లో సందడి చేసిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
ఈ చిత్రంలో అంజలి, సునీల్ కీ రోల్స్ చేస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్ గా వ్యవహరిస్తున్నాడు. ఎఫ్ 3 చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా..ట్రిపుల్ రేంజ్ నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ ఉండబోతుందని ధీమాగా చెప్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.