Tandel | కాశీ విశ్వనాథుడి సన్నిధిలో నాగచైతన్య.. సాయిపల్లవి
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘తండేల్' చిత్రం నిర్మాణం నుంచే అందరిలో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. శ్రీకాకుళం మత్య్యకారుల జీవితంలో జరిగిన యథార్థ ఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Tandel | నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘తండేల్’ చిత్రం నిర్మాణం నుంచే అందరిలో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. శ్రీకాకుళం మత్య్యకారుల జీవితంలో జరిగిన యథార్థ ఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జాలరుల జీవన పోరాటం, దేశభక్తి ప్రధానాంశాలుగా దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాకు రూపకల్పన చేస్తున్నారు. ఫిబ్రవరి 7న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని ‘బుజ్జి తల్లి..’ అనే గీతం మ్యూజిక్ ఛార్ట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.
రెండో గీతం ‘శివశక్తి..’ని ఈ నెల 22న వారణాసి ఘాట్స్‌లో విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా బుధవారం కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. శ్రీకాకుళం సాంస్కృతిక వారసత్వాన్ని, శ్రీముఖలింగం శివాలయ విశిష్టతను తెలియజెప్పే ఈ పాట విజువల్‌గా అద్భుతంగా ఉంటుందని, జాతర నేపథ్యంలో ఆధ్యాత్మిక శోభతో ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది. దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన ఈ గీతానికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సమర్పణ: అల్లు అరవింద్, నిర్మాత: బన్నీ వాసు, రచన-దర్శకత్వం: చందూ మొండేటి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

